Monday, December 23, 2024

ప్రజలు ప్లాస్టిక్ కవర్లు వాడొద్దు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/మోత్కూరు: ప్రజలు ప్లాస్టిక్ కవర్లు వాడకుండా వాటి నిషేధానికి కృషి చేయాలని మున్సిపల్ చైర్‌పర్సన్ తీపిరెడ్డి సావిత్రి మేఘారెడ్డి అన్నారు. ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని నిషేధించాలని కోరుతూ మంగళవారం మోత్కూరు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పట్టణంలో పాలకవర్గం, సిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… దుకాణాదారులకు ఇప్పటికే కవర్లు అమ్మవద్దని, వాడవద్దని అవగాహన కల్పించి నోటీసులు కూడా ఇచ్చామన్నారు. 120 మైక్రాన్ల కన్నా తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ కవర్లను ఉపయోగించవద్దని, కవర్లు అమ్మితే జరిమానాతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ బొల్లెపల్లి వెంకటయ్య, కమిషనర్ శ్రీకాంత్, కౌన్సిలర్లు బొడ్డుపల్లి కల్యాణ్‌చక్రవర్తి, గుర్రం కవిత లక్ష్మీనర్సింహారెడ్డి, వనం స్వామి, కూరెళ్ల కుమారస్వామి, కోఆప్షన్ మెంబర్ గనగాని నర్సింహ, మార్కెట్ మాజీ చైర్మన్ టి.మేఘారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News