Thursday, December 26, 2024

బీరుట్ విడిచి భయంతో తరలిపోతున్న జనం

- Advertisement -
- Advertisement -

జెరూసలెం: హమాస్ అధినేత యాహ్యా సిన్వర్‌ను చంపిన నేపథ్యంలో ఇజ్రాయెల్‌పై ప్రతీకార దాడులకు దిగుతామని లెబనాన్ లోని హెజ్‌బొల్లా ఇటీవల హెచ్చరించిన సంగతి తెలిసిందే. దీంతో హెజ్‌బొల్లా ఆర్థిక మూలాలపై ఇజ్రాయెల్ గురి పెట్టింది. రానున్న కొన్ని గంటల్లో బీరుట్ సహా లెబనాన్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున బాంబు దాడులకు పాల్పడనున్నట్టు ప్రకటించింది.

హెజ్‌బొల్లా ఉగ్రకార్యకలాపాలకు ఆర్థికంగా అండగా ఉండే ప్రాంతాలకు సమీపంలో ఉన్న ప్రజలు వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ మిలిటరీ అధికార ప్రతినిధి డేనియల్ హగారీ హెచ్చరికలు జారీ చేశారు. ఈ హెచ్చరికలు వచ్చిన కాసేపటికే బీరుట్ లోని పలు ప్రాంతాల్లో భారీగా పేలుడు శబ్దాలు వినిపించాయి. నగరంలోని ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయం సమీపం లోనే కాకుండా, శివారు ప్రాంతాల్లోని దాదాపు 11 ప్రాంతాల్లో పేలుళ్లు చోటు చేసుకున్నాయి. బీరుట్ లోని వేలాది మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లిపోతున్నారు.

ప్రాణభయంతో ఒక్కసారి మూకుమ్మడిగా వీధుల్లోకి రావడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. లెబనాన్ వ్యాప్తంగా హెజ్‌బొల్లాకు నిధులు సమకూర్చే అల్ ఖర్డ్ అల్ హసన్ బ్రాంచీలు దాదాపు 30 వరకు ఉన్నాయి. ఇందులో సగం బీరుట్ లోని అత్యంత రద్దీ అయిన ప్రదేశాలు, నివాస సముదాయాల్లోనే ఉండటం గమనార్హం. వీటిని లక్షంగా చేసుకుని దాడులు చేస్తామని ఇజ్రాయెల్ మిలిటరీ అధికార ప్రతినిధి డేనియల్ హగారీ హెచ్చరించారు. అల్‌ఖర్డ్ అల్ హసన్ అనేది లైసెన్స్ లేని గ్రేమార్కెట్ బ్యాంక్. హెజ్‌బొల్లాకు నిధులు సమకూర్చే ప్రధాన ఆర్థిక వనరుగా పనిచేస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News