Saturday, January 18, 2025

ఓటు కోసం నగరం పల్లెబాట..

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు రాష్ట్ర ప్రజలు నగరం నుంచి సొంతూళ్ల బాట పట్టారు. వివిధ జిల్లాలకు వెళ్లేవారు ఒకరోజు ముందుగానే సొంతూళ్లకు బయలుదేరారు. రాష్ట్రంలో పోలింగ్ సందర్భంగా విద్యాసంస్థలకు రెండు రోజులు ప్రభుత్వం సెలవులు ఇచ్చింది. దీంతో మంగళవారం సాయంత్రం నుంచే రాష్ట్రంలో ఎక్కడ చూసినా కుటుంబాలతో వెళ్తుండడంతో బస్టాండ్లలో రద్దీ కనిపిస్తోంది.రెండు, మూడు రోజులుగా అడ్డాలపై కూలీలు కూడా పెద్దగా కనిపించడం లేదు. పనుల కోసం వలన వెళ్లిన ఓటర్లను సొంతూళ్లకు రావాలని ఇప్పటికే అన్ని పార్టీల అభ్యర్థులు కుటుంబ సభ్యులను కోరారు. కొద్దిరోజులుగా అభ్యర్థులు కూడా నగరానికి వచ్చి తమ నియోజకవర్గంలోని ఓటర్లతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. దీంతోపాటు రవాణా సదూపాయం కూడా ఏర్పాటు చేశారు.

నగరంలో ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలకు చెందిన వారు ఎక్కువగా ఎల్బీనగర్, సాగర్ రింగ్ రోడ్, దిల్‌సుఖ్ నగర్, బిఎన్ రెడ్డి నగర్ ప్రాంతాల్లో ఉంటున్నారు. అలాగే ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన వారు మెహిదీపట్నం వైపు, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల వారు ఎల్బీనగర్, ఉప్పల్ వైపు మెదక్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన వారు లింగంపల్లి, బాలానగర్, బోయిన్‌పల్లి, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు ఈసారి వలస ఓటర్లపై దృష్టి పెట్టారు. ఓటర్లకు చేసి మరీ ఎప్పుడొస్తున్నారని ఆయా పార్టీల లోకల్ లీడర్లు ఆరా తీశారు. పోలింగ్ రోజు వచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తామని ఓటర్లకు సైతం భరోసా ఇచ్చారు. ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన కొందరు వలస ఓటర్లను తరలించే పనిలో నిమగ్నమయ్యారు. అంతా సొంతూళ్లకు బయలుదేరడంతో ఎంజీబిఎస్, జూబ్లీ బస్ స్టేషన్లు కిక్కిరిసిపోయాయి. అన్ని బస్సుల్లో సీట్లు దొరక్క చాలామంది ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News