Monday, January 6, 2025

తెలంగాణ భవన్‌లో ఘనంగా ‘ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాల వేడుకలు‘

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ‘ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాల వేడుకలు’ ఆదివారం ఘనంగా జరిగాయి. తెలంగాణ భవన్ రెసిడెంట్ కమీషనర్ డా. గౌరవ్ ఉప్పల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి న్యూ ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఎపి జితేందర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన అనంతరం చిన్నారులు స్నితిక,హంసితలచే రాష్ట్ర గేయం ‘జయ జయహే తెలంగాణ గీతాలాపన‘ జరిగింది.ఈ సందర్భంగా తేజస్వినీ గ్రూప్ ఆప్ పెర్ఫార్మింగ్ ఆరట్స్ బృందంచే జానపద నృత్య ప్రదర్శన,ఔత్సాహిక కళాకారుల చే నృత్య ప్రదర్శనలు ఉల్లాసభరితమైన వాతావరణంలో జరిగాయి.

ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఎపి జితేందర్ రెడ్డి వేదిక మీద మాట్లాడుతూ ‘ వీరోచిత పోరాటంతో నియంతృత్వ పాలన నుంచి తెలంగాణ రాష్ట్రానికి స్వేచ్ఛావాయువులు అందించిన కాంగ్రెస్ పార్టీ, అదే ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రాన్ని మహోజ్వల రాష్ట్రంగా తీర్చిదిద్దే దిశగా అడుగులు వేస్తున్నది. రాష్ట్ర ప్రజలు కోరి తెచ్చుకున్న ప్రజా ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ‘ప్రజాపాలన -ప్రజా విజయోత్సవాలు’ కార్యక్రమాన్ని రా ష్ట్ర పండుగగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ కోవలోనే ఈ స్ఫూర్తి ని దేశ రాజధానిలో కూడా చాటేందుకు సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో కూడా ఈ ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాలను నిర్వహిస్తున్నాం.

పోరాటాలను, ఉద్యమాలను, త్యాగాలను, ఆత్మబలిదానాలను, ఆకాంక్షలను, ఆశయాలను, అన్నింటినీ కలిపి వీలునామాగా రాసి డిసెంబర్ 7, 2023 నాడు తెలంగాణ ప్రజానీకం ప్రభుత్వాన్ని మా చేతుల్లో పెట్టింది. ఆక్షణం నుండి సకల జనహితమే పరమావధిగా, తెలంగాణ ఆత్మగౌరవమే ప్రాధాన్యతగా, జనహితుల ప్రోత్సాహంతో, విమర్శలను సహిస్తూ, విద్వేషాలను ఎదురిస్తూ, స్వేచ్ఛకు రెక్కలు తొడిగి, ప్రజాస్వామ్యానికి రెడ్ కార్పెట్ పరిచి, అవనిపై అగ్ర భాగాన తెలంగాణను నిలిపేందుకు గొప్ప లక్ష్యాల వైపు నడుస్తూ నాలుగు కోట్ల ఆశయాలను నడిపిస్తూ, నిరంతరం జ్వలించే తెలంగాణ మట్టి చైతన్యమే స్ఫూర్తిగా విరామం ఎరుగక విశ్రాంతి కోరక సమస్త ప్రజల ఆకాంక్షలు సంపూర్ణంగా నెరవేర్చడమే లక్ష్యంగా నిరంతరం శ్రమించాం. మానిఫెస్టో లో పెట్టిన మహాలక్ష్మి పధకం ,రైతు భరోసా,గృహాజ్యోతి,ఇందిరమ్మ ఇళ్ళు,యువ వికాసం,చేయూత వంటి ఆరు గ్యారెంటీలే కాకుండా మానిఫెస్టో లో చెప్పనటువంటి నూట అరవై మంచి పనులు చేశాం.

తెలంగాణ ను ఫ్యూచర్ స్టేట్ గా నిలిపేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నాం. తెలంగాణ భవన్ కూడా ఇదే కోవలో ఆపద సమయంలో రాష్ట్రం వెలుపల వున్నటువంటి తెలంగాణ ప్రజలకు అన్ని విధాలుగా అండగా నిలిచింది. కోవిడ్ కష్ట కాలంలో వివిధ ప్రాంతాలలో చిక్కుకుపోయిన తెలంగాణ ప్రజలను రాష్ట్రానికి చేర్చేందుకు భవన్ సిబ్బంది నిర్విరామంగా పని చేశారు. అదే విధంగా ఉక్రెయిన్ యుద్ద సంక్షోభ సమయంతో పాటు వివిధ సంక్షోభాలలో ఆయా దేశాలలో చిక్కుకు పోయినటువంటి తెలంగాణ విద్యార్థులు, ప్రజలను మన రాష్ట్రానికి క్షేమంగా చేర్చేందుకు వివిధ ఎంబసీలతో మాట్లాడి వారిని ఢిల్లీకి చేరుకున్న తర్వాత భోజనం, వసతి, కల్పించి ప్రభుత్వ ఖర్చులతో వారికి రాష్ట్రానికి పంపించడం జరిగింది.

వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలతో నిత్యం సంప్రదిస్తూ,సమన్వయ పరుస్తూ రాష్ట్రానికి రావాల్సిన నిధులను వీలైనంత వేగంగా మంజూరు చేయడంలో తోడ్పడుతూ రాష్ట్ర అభివృద్ది కి తెలంగాణ భవన్ సైతం ఎల్లవేళలా చేయూతనిస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమమే పరమావధిగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల సేవలో పునరంకితమవుతున్నది అని తెలియజేస్తూ ముగిస్తున్నాను.‘ అని అన్నారు. కార్యక్రమంలో తెలంగాణ భవన్ రెసిడెంట్ కమీషనర్ డా. గౌరవ్ ఉప్పల్, ఇతర భవన్ అధికారులు, సిబ్బంది వారి కుటుంబ సభ్యులు, ఢిల్లీలోని తెలుగు ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News