ఇల్లందు :ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు పూర్తి విశ్వాసం పెరింగిందని స్ధానిక శాసనసభ్యురాలు బానోత్ హరిప్రియా హరిసింగ్‌నాయక్ అన్నారు. ఈ సందర్భంగా ఆమె బుధవారం రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకోని స్థానిక వైద్యశాలలో నిర్వహించిన తెలంగాణ వైద్య ఆరోగ్య దినోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం ముఖ్యమంత్రి కెసిఆర్ వైద్యరంగాన్ని బలోపేతం చేశారని, ఏలాంటి వ్యాధులు ప్రబలిన ప్రజలకు ప్రభుత్వ వైద్యశాలలో అధునాతన చికిత్స అందిస్తున్నారన్నారు.
పేదల సంక్షేమం కోసం వినూత్న పథకాలను ప్రవేశపెట్టి సకల సౌకర్యాలు కల్పించి కార్పొరేట్ స్థాయిలో వైద్యసేవలు అందిస్తున్నారన్నారు. డయాలసిస్ కేంద్రాలు, డయాగ్నోస్టిక్ సెంటర్లు, కెసిఆర్ కిట్లు, అమ్మఒడి లాంటి కార్యక్రమాలను ప్రారంభించి ప్రజలకు ప్రభుత్వ వైద్యశాలలపై నమ్మకాన్ని పెంచారన్నారు. సమైక్యపాలనలో నేనురాను బిడ్డ సర్కారు దవాఖానాకు అని పాడుకున్న ప్రజలు నేడు ప్రభుత్వ దవాఖానాలకు పరుగులు పెడుతున్నారన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లు, వైస్‌చైర్మన్ జానీపాష, మున్సిపల్ కమిషనర్ అంకుషావళి, ఎమ్‌పిపి చీమల నాగరత్నమ్మ, వైద్యశాల సూపరిడెంట్ డాక్టర్ శిరీష్, ఆర్‌ఎమ్‌ఒ హర్షవర్ధన్, డాక్టర్లు బన్సిలాల్, తేజశ్రీ, సాయిచరిష్మా, రొంపేడు ఎంఒ డాక్టర్ కవిత, మురళికృష్ణ, సులానగర్ ఎంఒ దినేష్, గంధపల్లి ఎంఒ విజయ, ముల్కనూర్ ఎంఒ అవినాష్, గార్ల ఎంఒ రాజ్‌కుమార్ జాదవ్, బయ్యారం ఎంఒ సాగర్, కామేపల్లి ఎంఒ చందన, డిపిహెచ్‌ఎస్ అన్నామేరి, డిఎస్‌ఒ జినుగు మరియన్న, పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు, వైద్యసిబ్బంది, ఆశావర్కర్లు, తదితరులు పాల్గొన్నారు.