Saturday, November 23, 2024

మెట్రో సువర్ణ ఆఫర్‌కు జనం మొగ్గు….

- Advertisement -
- Advertisement -

People huge response to Metro Suvarna offer

పాసులు భారీగా కొనుగోలు చేస్తున్న నగరవాసులు
నెల వారీ లక్కీ డ్రాలో ఐదుగురికి బహుమతులు
రైళ్ల సమయం పొడిగింపు 15 శాతం పెరిగిన ప్రయాణికులు
జనవరి 22 తేదీ వరకు 3 లక్షల పాసులు కొనుగోలు చేయవచ్చని భావిస్తున్న మెట్రో

హైదరాబాద్ : గ్రేటర్ నగరవాసులను వివిధ ప్రాంతాలకు చేరవేస్తున్న మెట్రో గత నెలలో ప్రకటించిన సువర్ణ ఆఫర్‌కు మొగ్గు చూపుతున్నారు. ఆఫర్ ప్రవేశ పెట్టిన తరువాత ప్రయాణికులు సంఖ్య గణనీయంగా పెరిగిందని, ప్రతి రోజు 2.50 లక్షల మందికి పైగా రాకపోకలు సాగిస్తున్నట్లు మెట్రో అధికారులు పేర్కొంటున్నారు. డిసెంబర్ మొదటి వరకు ప్రయాణికుల సంఖ్య 4 లక్షల వరకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. సువర్ణ ఆఫర్ కింది నెలసరి పాసులు కొనుగోలు చేసిన ప్రయాణికులకు లక్కీ డ్రా ద్వారా విజేతలకు ఎంపిక చేశారు. అక్టోబర్ 18 నుంచి 31వరకు నెలసరి పాసులు 40వేలు కొనుగోలు చేశారు. నవంబర్ నెలల్లో 1.10 లక్షలకుపైగా నగర ప్రజలు పాసులు కొనుగోలు చేస్తారని మెట్రో సిబ్బంది భావిస్తున్నారు. మొదటిసారి తీసిన డ్రాలో ఐదుగురు బహుమతులు సాధించారు. దీంతో గత రెండు రోజుల నుంచి రోజుకు 2వేల మంది ఆఫర్ పాసులు కార్డులు తీసుకున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు.

సువర్ణ ఆఫర్ 15 జనవరి 2022వరకు అందుబాటులోకి ఉంటుందని అప్పటివరకు సుమారుగా 3 లక్షల మంది సువర్ణ ఆఫర్ పాసులు కొనుగోలు చేయవచ్చంటున్నారు. అదే విధంగా నవంబర్ మొదటి వారం నుంచి మెట్రోస్టేషన్ల వద్ద పార్కింగ్ నిండిపోతుందని, రోజుకు ఒక స్టేషన వద్ద 5200 వరకు ద్విచక్ర వాహానాలు పార్కింగ్ చేసి పలు ప్రాంతాలకు వెళ్లుతున్నట్లు చెబుతున్నారు. కోవిడ్ రెండు వేవ్‌లలో భారీ నష్టాలు చవిచూసిన మెట్రో కొత్త పథకాలు తీసుకరావడంతో నగర ప్రజలు మెట్రో ప్రయాణం చేసేందుకు ఇష్టపడుతున్నట్లు పలువురు పేర్కొంటున్నారు. ఈనెల 10వ తేదీ నుంచి మెట్రో సర్వీసులు ఉదయం 6 గంటల నుంచి ప్రారంభించడంతో కూడా ప్రయాణికులు సంఖ్య గతం కంటే 15 శాతం పెరిగినట్లు చెబుతున్నారు.

నూతన పథకాలతో మరింత ఆదాయం సమకూర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మెట్రో ప్రయాణికులు తమ ప్రయాణ అవసరాలకు తగినట్లుగా ఏదైనా ఫేర్‌తో 30 ట్రిప్పులను కేవలం 20 ట్రిప్పుల ధర చెల్లించి 45 రోజుల పాటు తిరగవచ్చని మెట్రో స్మార్ట్ కార్డ్‌పై మాత్రమే వర్తిస్తుందని చెప్పారు. నవంబర్, డిసెంబర్, జనవరిలో ప్రతి నెలా ఐదుగురు విజేతలను లక్కీడ్రా సిఎస్‌సీ కార్డు వినియోగదారుల నుంచి ఎంపిక చేస్తామని మెట్రో ఉన్నతాదికారులు వెల్లడిస్తున్నారు. వీరు ఓక్యాలెండర్ నెలలో కనీసం 20 సార్లు ప్రయాణించాల్సి ఉంటుంది. వినియోగదారులు తమ సిఎస్‌సీ (కాంటాక్ట్ లెస్ స్మార్ట్ కార్డు)లను టీ సవారీ, మెట్రో స్టేషన్ల వద్ద నమోదు చేసుకోవాల్సి సూచిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News