Wednesday, January 22, 2025

అడ్డగుట్టలో కోతుల స్వైర విహారం

- Advertisement -
- Advertisement -

అక్కడ జనం బయటికి రావాలంటేనే జంకుతున్నారు. పగలు కూడా తలుపులే కాదు కిటికీలూ మూసే ఉంచుతారు…పిల్లలే కాదు పెద్దలూ ఒంటిరిగా బయటికి రావాలంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకొవల్సిందే. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకోస్తుందోనని భయాందోళనలతో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఇదేదో మారుమూల గ్రామమో….అటవీ ప్రాంతమో అనుకుంటే తప్పులే కాలేసినట్లే. నగరంలోని అడ్డగుడ్డ ప్రాంతంలో. కోతుల స్వైరవిహారం స్థానికులకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. గుంపులుగా వచ్చి రోడ్డుపై వెళ్లేవారిపై, ఇళ్లల్లోకి వచ్చి మరీ దాడులు చేసి గాయపరుస్తున్నాయి. సమీపంలో ఉన్న హాస్టళ్లలలోకి వెళ్లికూడా దాడులు చేస్తున్నాయి. కోతుల దాడులతో భయానక పరిస్థితులు నెలకొన్నా అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. బుధవారం ఒక్క రోజే కోతుల దాడిలో పదిమందికి పైగా గాయపడ్డారని స్థానికులు మండిపడుతున్నారు.

అడ్డగుట్ట ప్రాంతంలో కోతులు స్వైరవిహారం చేస్తున్నాయని జిహెచ్‌ఎంసి, వెటర్నరీ అధికారులకు పలు పర్యాయాలు విన్నవించినా ఫలితం లేకపోవడంతో తాము బయటికి రావాలంటేనే ప్రాణాలను అరచేతిలో పెట్టుకోవల్సివస్తోందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇంటి తలుపులు వేసినా కిటికిలలోనుంచి లోపలికి వచ్చి దాడులు చేస్తున్నాయని తెలిపారు. పగలూరాత్రి తేడాలేకుండా కోతులు దాడులకు తెగబడుతున్నాయని వారు బిక్కుబిక్కుమంటున్నారు సమీపంలో హాస్టళ్లు ఉండటంతో వాళ్లు వేసి ఆహారపదార్థాలకు మెల్లిమెల్లిగా కోతులు వచ్చిచేరాయని, ప్రస్తుతం వందలసంఖ్యలో తయారయ్యాయని వారు పేర్కొంటున్నారు. బుధవారం రాత్రి కోతుల దాడుల్లో అడ్డగుట్ట రోడ్డు నెంబర్ 4కు చెందిన హారిక, జి.రాజేష్,రోడ్డు నెంబర్2కు చెందిన నరేంద్ర, ఉమర్,సామెల్, చరణ్ తదితరులు స్థానికంగా ఉన్న ఆసుపత్రిలో చికిత్సలు చేయించుకున్నారు.

ప్రతిరోజు కోతుల దాడుల్లో గాయాలపాలై ఆసుపత్రులకు వెళ్తున్నారని, ఇప్పటికే చాలా మందిని గాయపరిచాయని స్థానికులు చెబుతున్నారు. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి కోతుల బెడద నుంచి తమను కాపాడాలని వేడుకుంటున్నారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని అడ్డగుట్ట వాసులు హెచ్చరిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News