మంగపేట: మండలంలోని ఇటీవల వరస దొంగతనాలకు ప్పాడుతున్న ఇద్దరి దొంగలను అరెస్ట్ చేసి రిమండ్‌కు పంపినట్టు మంగపేట ఎస్సై గోదావరి రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం గత పది రోజుల క్రితం కమలాపురంలోని సాయిబాబా గుడిలో జరిగిన హూండీ దొంగతనం కేసులో నిందితులు కమలాపురం గ్రామంలోని పల్లె ప్రకృతి వనంపన్నారనే సామాచారం మేరకు అక్కడి వెళ్ళడం జరిగిందని అన్నారు.
పల్లె పకృతి వనం వద్దకు వెళ్ళగానే నిమ్మల వినయ్ కుమార్, ఇటుకల నిఖిల్‌తో పాటు మరో ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసిపారిపోతుండగా వారిని వెంబడించి పట్టుకుని విచారించగా వివిధ దొంగతనాలలో పాల్గొన్నట్టు ఒప్పుకున్నారని తెలిపారు. సాయిబాబా గుడిలో దొంగతనంతో పాటు గతంలో మరిన్ని నేరాలు చేశామని వారు ఒప్పుకున్నారని అన్నారు. వీరు దొంగిలించిన సొమ్మును చూపగా సొమ్ములను స్వాదీనం చేసుకున్నట్టు తెలిపారు.
స్వాదీనం చేసుకున్న సోమ్ములో సాయిబాబ ఆలయంలో దొంగిలించిన హూండీ డబ్బులు రూ 18వేల 880లు డబ్బులు, బజాజ్ డిస్కవరి బైక్, 8 గ్రాముల నల్లపూసల తాడు, 1బంగారు బిళ్ళ, 14 గ్రాముల బంగారు గోట్టాలు స్వాదీనం చేసుకున్నట్టు తెలిపారు. అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచినట్టు తెలిపారు. నిందితుల అరెస్ట్‌కు కృషి చేసిన సిబ్బంది సూర్యనారాయణ, ఆలం మోహన్, కుమార్, రాజ్‌కుమార్, ఎన్ నాగరాజు, చంద్రమోహన్, సురేష్, బద్రులను అభినందించారు.