Wednesday, January 22, 2025

తాంత్రికులు బాబాలపై నమ్మిక విచారకరం:బొంబాయి హైకోర్టు

- Advertisement -
- Advertisement -

ముంబై : కాలం ఎంతో పురోగమిస్తోందని అనుకుంటూ ఉన్నా ఇప్పటికీ ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి తాంత్రికులు, బాబాల తలుపు తడుతున్నారు. ఇది దురదృష్టకరం, విచారకరం అని బొంబాయి హైకోర్టు తెలిపింది. గత నెలలో వెలువరించిన సంబంధిత తీర్పు ఇప్పుడు హైకోర్టు వెబ్‌సైట్ ద్వారా వెలుగులోకి వచ్చింది. ప్రజలు వెర్రిగా తాంత్రికులను నమ్ముతున్నారు. ఈ క్రమంలో వారి చెప్పుడు మాటలకు నమ్మి మోసపోతున్నారని పేర్కొంది. మానసిక ఎదుగుదల లేని ఆరుగురు బాలికలపై తాంత్రికుడనే పేరిట చలామణిలో ఉన్న వ్యక్తి లైంగిక అత్యాచారాలకు దిగడం, ఈ వ్యక్తికి పడిన జీవితఖైదు శిక్షను సమర్థిస్తూ హైకోర్టు సామాజిక కోణంలో కీలక వ్యాఖ్యలు వెలువరించింది. అంధ విశ్వాసాల అరాచకానికి బాలికలపై జరిగిన లైంగిక చర్య పరాకాష్ట అయిందని న్యాయమూర్తులు రేవతి మోహితు దేరే, మంజూష దేశపాండేతో కూడిన ధర్మాసనం తెలిపింది. బాలికలను నయం చేస్తానని చెప్పి తాంత్రికుడు వారి జీవితాలను పాడుచేశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News