Monday, December 23, 2024

సగటు మనిషి బతుకు సాగించేదెలా?

- Advertisement -
- Advertisement -

సంపన్నులు, పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తల కుటుంబాలు ధరించే వజ్రాలు, వైడూర్యాలపై కేవలం 2 శాతం పన్ను విధిస్తుండగా, సామాన్యులు పేదలు, మధ్యతరగతి వర్గాలు ఉపయోగించే పెరుగుపై 18 శాతం, విద్యపై 18 శాతం జిఎస్‌టి విధిస్తున్నారంటే పాలకులు ఎవరి పక్షాన ఉన్నారో విశదమవుతుంది. దేశంలో కోట్లకు పడగలెత్తిన 160 పైగా బిలియనీయర్లపై పాలకులు పన్ను విధించిన దాఖలాలు లేవు. 160 మంది బిలియనీ యర్లపై కనీసం 3 శాతం పన్ను విధించినా రూ. 2 లక్షల కోట్లకు పైగా ప్రభుత్వాలకు ఆదాయ సమకూరుతుంది. సంపన్నులకు లక్షల కోట్ల రూపా యల రాయితీలు ఇస్తూ, సామాన్యులపై పన్నుపోటు పొడుస్తున్న పాలకులు.

పన్నుల పోటుతో సగటు మనిషి విలవిల్లాడుతున్నారు. ఛార్జీల వాత, పన్నుల మోత సామాన్యులకు గుదిబండగా మారింది. సామాన్యులపై భారం మోపుతూ… సంపన్నుల అప్పులు రద్దు చేస్తూ పాలకులు అండగా నిలుస్తున్నారు. వివిధ పన్నుల రూపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం సమకూరుతున్నప్పటికీ సామాన్యుల ద్విచక్ర వాహనం కొనుగోలు చేసినా, కుటుంబంతో సినిమాకు వెళ్ళినా వినోదం పన్ను విధిస్తున్నారు. ఒక వైపు వస్తు సేవా పన్ను (జిఎస్‌టి)తో ఆర్థిక భారం మోస్తూనే.. పలు రకాల పన్ను పోటుతో సామాన్యులు తల్లడిల్లుతున్నారు. జిఎస్‌టి పన్ను క్రింద కేంద్ర ప్రభుత్వానికి ప్రతి నెల రూ. 2 లక్షల కోట్ల నుంచి రూ. 2 లక్షల 50 వేల కోట్ల వరకు ఆదాయం వస్తుంది.రాష్ట్ర ప్రభుత్వంకు వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, స్టాంపులు, రిజిస్ట్రేషన్, రవాణా శాఖల నుంచి గణనీయమైన ఆదాయం సమకూరుతుంది.

ఒక వైపు ఎక్సైజ్ శాఖ నుంచి ఏటా రూ. 35 వేల నుంచి రూ. 40 వేల కోట్లు రాష్ట్రానికి ఆదాయం వస్తున్నప్పటికీ సామాన్యులు వాహనం కొన్నా, హోటల్‌కు వెళ్ళినా, దుస్తులు కొన్నా జిఎస్‌టి కట్టాల్సిందే. విద్య మీద, పాల మీద పెరుగు ఇలా ప్రతి దాని మీద జిఎస్‌టి విధించడంతో బడుగు జీవి బతుకు భారంగా మారింది. జనంపై ఎన్ని రకాల పన్నులు విధిస్తున్నరంటే నివ్వెర పోవాల్సింది. సంపాదిస్తే.. ఇన్‌కావ్‌ు ట్యాక్స్, అమ్మితే సేల్ ట్యాక్స్, ఉత్పత్తి చేస్తే ప్రొడక్షన్ ట్యాక్స్, సినిమాకు వేళ్తే ఎంటర్‌టైన్‌మెంట్ ట్యాక్స్, వెహికల్ కొంటే లైఫ్ ట్యాక్స్, వెహికల్ రోడ్డుపైకి వస్తే టోల్ ట్యాక్స్, వాహనంలో పెట్రోల్ పోస్తే ఫ్యూయల్ ట్యాక్స్, భార్యా పిల్లలతో పార్క్ వెళ్తే ఎంట్రీ ట్యాక్స్, ఉద్యోగం చేస్తే ప్రొఫెషనల్ ట్యాక్స్, చిన్నచితక వ్యాపారం చేస్తే ట్రేడ్ ట్యాక్స్, బట్టలు కొంటే జిఎస్‌టి, కరెంట్, వాటర్ బిల్లులు కడితే సర్వీసు ట్యాక్స్, ఆస్తిపై ప్రాపర్టీ ట్యాక్స్, చివరికి పబ్లిక్ టాయిలెట్‌కు వేళ్తే పే అండ్ యూజ్ ఇలా పన్ను పోటులతో సామాన్యులు సతమతమవుతున్నారు.

రాజనీతి తత్వవేత్త హబ్స్ ‘సామాజిక ఒడంబడిక సిద్ధాంతంలో ప్రభువులు (పాలకులు) ప్రజల సంక్షేమంగా పాలన సాగించాలని హితబోధ పలికారు. పాలకులు ప్రభువులు ప్రజల పక్షాన నిలబడి సంక్షేమ రాజ్యాన్ని పాలించాలని గ్రీకు తత్వవేత్తలు ఆరీస్టాటిల్, ప్లేటో, ఏనాడో ఉద్బోధించారు. ఆ తత్వవేత్తలు చెప్పినట్టుగా మన పాలకులు రాజ్యపాలన చేయకుండా పన్నుల భారంతో పాలన సాగిస్తున్నారు. సామాన్యులు నిత్యం ఉపయోగించే పెరుగుపై 18 శాతం జిఎస్‌టి విధిస్తున్నారు. పెన్ను, పెన్సిల్, రబ్బర్, పాదరక్షలు, జిఎస్‌టి ఇలా ఒకటేమిటి హోటల్‌లో 30 రూపాయలు టీ తాగితే 6 నుంచి 7 రూపా జిఎస్‌టి కట్టాల్సిందే.

సింగిల్ బిర్యాని 110 రూపాయాలు కాగా జిఎస్‌టితో కలిపి 120 రూపాయాలు దండుకుంటున్నారు. సంపన్నులు, పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తల కుటుంబాలు ధరించే వజ్రాలు, వైడూర్యాలపై కేవలం 2 శాతం పన్ను విధిస్తుండగా, సామాన్యులు పేదలు, మధ్యతరగతి వర్గాలు ఉపయోగించే పెరుగుపై 18 శాతం, విద్యపై 18 శాతం జిఎస్‌టి విధిస్తున్నారంటే పాలకులు ఎవరి పక్షాన ఉన్నారో విశదమవుతుంది. దేశంలో కోట్లకు పడగలెత్తిన 160 పైగా బిలియనీయర్లపై పాలకులు పన్ను విధించిన దాఖలాలు లేవు.

160 మంది బిలియనీయర్లపై కనీసం 3 శాతం పన్ను విధించినా రూ. 2 లక్షల కోట్లకు పైగా ప్రభుత్వాలకు ఆదాయ సమకూరుతుంది. సంపన్నులకు లక్షల కోట్ల రూపాయల రాయితీలు ఇస్తూ, సామాన్యులపై పన్నుపోటు పొడుస్తున్న పాలకులు. సంక్షేమ రాజ్యంలో పాలకులు ప్రజల ఆర్థిక, సామాజిక, సంక్షేమ రంగాలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రజల జీవన ప్రమాణాలు మార్చాలి తప్ప పన్నుల పోటుతో ప్రజలపై ఆర్థిక భారాల కుంపటిపెడితే బతుకు సాగించేదెలా అన్న ప్రశ్నలు వెలుగు చూస్తున్నాయి. ప్రత్యామ్నాయ ఆర్థిక వనరులు కోసం ప్రభుత్వం అన్వేషించాలి తప్ప పన్నుల భారంతో ప్రజలు బతుకు ఛిద్రం చేసే ఎలా అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.

గుర్రం రాంమోహన్ రెడ్డి
7981018644

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News