Saturday, November 23, 2024

కరోనా రెండో డోసుకు స్పందన అంతంతే…

- Advertisement -
- Advertisement -

వైరస్ తగ్గిందనే భావనతో ముందుకు రాని స్దానికులు
నగరంలో సరిపడ్డ టీకా నిల్వలు ఉంచిన వైద్యశాఖ
ఆర్యోగ కార్యకర్తలు ఇంటింటా ప్రచారం చేసిన పట్టించుకోని జనం
థర్డ్‌వేవ్ వస్తే ఆరోగ్య సమస్యలు తప్పవని వైద్యుల హెచ్చరికలు

People not respond on second dose
మన తెలంగాణ,సిటీబ్యూరో: నగరంలో కరోనా వైరస్ విస్తరించకుండా వైద్యశాఖ అధికారులు కరోనా వ్యాక్సిన్ సెకండ్ డోసు పంపిణీ గత 15 రోజుల నుంచి చేస్తున్నారు. ప్రారంభించిన ఐదు రోజుల పాటు స్దానికులు టీకా తీసుకునేందుకు క్యూ కట్టారు. మూడు రోజుల నుంచి వ్యాక్సిన్ కోసం వచ్చే వారి సంఖ్య తగ్గిందని వైద్య సిబ్బంది పేర్కొంటున్నారు. గ్రేటర్ వ్యాప్తంగా రోజుకు 1.50 లక్షల మందికి పంపిణీ చేస్తే విధంగా చర్యలు చేపట్టింది. దీనికి తోడు ఎఎన్‌ఎంలు, ఆశ, అంగన్‌వాడీ వర్కర్లు బస్తీలు, కాలనీల్లో తిరుగుతూ కరోనా మొదటి డోసు తీసుకుని సెకండ్ డోసు తీసుకోనివారి గుర్తించి త్వరగా వ్యాక్సిన్ వేసుకోవాలని సూచినలు చేసిన ప్రజలు స్పందించడంలేదంటున్నారు.

గ్రేటర్ పరిధిలో 15 లక్షల డోసులు నిల్వ ఉంచినట్లు, వాటి ద్వారా 40 లక్షలమందికి పంపిణీ చేసే విధంగా ఏర్పాట్లు చేసినట్లు వైద్యాధికారులు వెల్లడిస్తున్నారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటు చేసి ఆశావర్కర్, అంగన్వాటీ వర్కర్ వీఆర్‌ఏ సభ్యులుగా చేసి, ప్రతి మండలానికి ఒక ప్రత్యేకాధికారి నియమించి ప్రతి రోజు వ్యాక్సిన్ వేగం జరిగేలా పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. గ్రేటర్ మూడు జిల్లాల పరిధిలో మొదటి డోసు 1,14,93,410 మంది వ్యాక్సిన్ తీసుకోగా హైదరాబాద్ జిల్లా పరిధిలో ఇప్పటివరకు సెకండ్ డోసు 18,02,105 మంది , సెకండ్ డోసు 13,51 ,624 మంది, మేడ్చల్ జిల్లాలో సెకండ్ డోసు 14.25,405 మంది తీసుకున్నట్లు ఆయా జిల్లా వైద్యాధికారులు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

ఇంకా మూడు జిల్లాల పరిధిలో 19 లక్షల మంది తీసుకోవాలని, ఆరోగ్య కార్యకర్తలు ఇంటి వద్దకు వెళ్లితే కొంతమంది సీజనల్ వ్యాధులకు గురికావడంతో టీకా దూరంగా ఉన్నారని, మరికొందరు గ్రామాలకు వెళ్లారని, పోన్ ద్వారా సమాచారం అందిస్తే కరోనా వైరస్ ప్రభావం తగ్గిందని, ప్రస్తుతం అవసరమాని నిర్లక్షంగా సమాధానం చెబుతున్నట్లు వైద్యసిబ్బంది చెబుతున్నారు. ఈనెలాఖరు లోగా గ్రేటర్ పరిధిలో వందశాతం టీకా పంపిణీ పూర్తి చేసి థర్డ్‌వేవ్ వచ్చి ఎదుర్కొంటామంటున్నారు. నగర ప్రజలు వైరస్ పట్ల నిర్లక్షం చేయకుండా ముఖానికి మాస్కులు ధరించాలని, జేబుల్లో శానిటైజర్ ఉంచుకోవాలని, పెళ్లిళ్లు, వేడుకల సందర్భంగా మాల్స్, దుకాణాల్లో జనం రద్దీ ఉందని, యాజమాన్యాలు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. విందు, వినోదాలు వేడుకల పరిమిత సంఖ్యలో చేసుకోవాలని, గుంపులు చేరి అట్టహాసంగా నిర్వహిస్తే వైరస్ ఉనికి చాటుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చలికాలం ముగిసేవరకు కోవిడ్ నిబంధనలు పాటించాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News