Monday, December 23, 2024

అన్ని వర్గాల ప్రజలు ఆత్మగౌరవంతో బతకాలి

- Advertisement -
  • లక్ష పంపిణికి శ్రీకారం
  • నిరుపేదల జీవితంలో వెలుగులు
  • కుల వృత్తులకు సీఎం కేసీఆర్ భరోసా
  • తొమ్మిది ఏళ్లలో తెలంగాణ అద్భుత ప్రగతి
  • బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్
    కరీంనగర్: తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఆత్మగౌరవంతో బతకాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమని బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా కరీంనగర్ నగర శివారులోని శుభం గార్డెన్ లో నిర్వహించిన సంక్షేమ సంబరాలు కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్ పాల్గొన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 104 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను రెండో విడత గొర్రెల పంపిణీలో భాగంగా 126 గొర్రెలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ1969 నుండి 2014 వరకు తెలంగాణ పోరాటం కొనసాగిందని.. తెలంగాణ ఆకాంక్షలో న్యాయం ఉంది కనుకనే కొట్లాడి తెలంగాణను సాధించుకున్నాం అన్నారు. సమైక్య పాలనలో నిరుపేదల జీవితాలు మారలేదని. సమైక్య పాలనలో అప్పటి పాలకులు తెలంగాణ సంపదను కొల్లగొట్టారు నీళ్లను నిధులు, బొగ్గును దోచుకెళ్లారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదలు ఆత్మగౌరవంతో బతుకుతున్నారని అన్నారు.
  • ఒక్కో కుటుంబానికి 1 లక్ష రూపాయలు
    కుల వృత్తులకు జీవం పోయాలనే సంకల్పంతో..ఒక్కో కుటుంబానికి 1 లక్ష రూపాయలు సాయం అందిస్తున్నామని మంత్రి గంగుల తెలిపారు. 9 మంది కులవృత్తులకు లక్ష రూపాయల చొప్పున చెక్కులను అందజేశారు. పేదల సంక్షేమం కోసం కేసిఆర్ కంటే గొప్పగా ఎవరూ ఆలోచన చేయలేదని అన్నారు. వృద్దులకు పెద్ద కొడుకుగా,ఒంటరి మహిళకు అన్నగా,ఆడబిడ్డ పెళ్లికి మేనమామగా ఆసరైతున్నడని వెల్లడించారు. తెల్లారితే కేసిఆర్ ప్రభుత్వాన్ని విమర్శించే బిజెపి,కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పేదల కోసం చేసేది ఏమీ లేదని అన్నారు కుల వృత్తులకు నేటి నుంచి కొత్త పథకం ప్రారంభం బిసి కుల వృత్తుల కుటుంబాలకు కేసిఆర్ ప్రభుత్వం అందించే లక్ష రూపాయల ఆర్థిక సహాయం కార్యక్రమం నేటితో ప్రారంభం అయ్యిందని..లబ్ధిదారులంతా దీనిని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని మంత్రి గంగుల ఆకాంక్షించారు రజక, నాయీబ్రాహ్మణ,అవుసుల,వడ్రంగి,చాకలి,ఆరే కటిక కుటుంబాలకు చెక్కులు అందజేశారు. కేసిఆర్ ప్రభుత్వం కుల వృత్తులకు భరోసా కల్పించేందుకు ఆర్ధికంగా తోడ్పాటు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని మంత్రి వెల్లడించారు..రానున్న రోజుల్లో మిగతా కుల వృత్తుల అర్హులైన లబ్ధిదారులకు 1లక్ష రూపాయల చొప్పున అందజేస్తామని చెప్పారు.
  • నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్య
    తెలంగాణ లో నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని వెల్లడించారు. ఒక్కో విద్యార్థికి 1లక్ష 25 వేల రూపాయలు ఖర్చు చేస్తూ న్నామని నాణ్యమైన విద్య,పౌష్ఠిక ఆహారం అందిస్తున్నమని తెలిపారు. మిషన్ భగీరథతో ఇంటింటికీ నల్లా నీరు ఇవ్వడం వల్ల ఎండ కాలంలో ఉండే నీటి బిందల గొడవలు నేడు లేవన్నారు. తెల్లారితే కేసిఆర్ ప్రభుత్వాన్ని విమర్శించే బిజెపి,కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పేదల కోసం చేసేది ఏమీ లేదని విమర్శించారు.
    200 కోట్లతో కరీంనగర్ అభివృద్ధిః
    కరీంనగర్ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం 200 కోట్ల నిధులు కేటాయించిందని నగరం అద్భుతంగా అభివృద్ధి చెందుతుందని ఎక్కడ చూసినా పనులు కొనసాగుతున్నాయి అని అన్నారు. తెలంగాణ రాకముందు కరీంనగర్ ఎలా ఉంది…ఇప్పుడు ఎలా ఉందో ఒక్కసారి గుర్తు చేసుకోవాలని అన్నారు.. గడిచిన ఏడు దశాబ్దాల కాలంలోఎన్నో ప్రభుత్వాలు మారాయని..సీఎంలు..పియంలు మారారు కానీ ప్రజల బతుకులు మారలేదని ఆవేదన వ్యక్తం చేసారు…తెలంగాణ వచ్చిన తర్వాత అభివృద్ధి కళ్ళముందే కనిపిస్తుందని.. ఎలా ఉన్నా కరీంనగర్ ఎలా మారిందో గుర్తు చేసుకోవాలని అన్నారు. కరీంనగర్ అభివృద్ధి కోసం నిధులు కావాలని నాటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని అడిగితే వెకిలిగా నవ్వారే తప్ప ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని అన్నారు. నాడు ఆసరా పింఛన్ కావాలంటే ఇంకొక ఆసరా పింఛన్ లబ్ధిదారుడి చావు కోసం చూడాల్సిన రోజులు ఉండేవని కాని స్వయం పాలనలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఆసరా పింఛన్లు ఇస్తున్నాని అన్నారు. సమక్షపాలనలో అప్పటి పాలకులు తెలంగాణలోని నీళ్లు బొగ్గు కరెంటు సంపదను దోచుకున్నారని అన్నారు. మన భూములను బీడు పెట్టి… వారి ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసుకున్నారని అన్నారు.
  • జిల్లాలోని 38,026 మందికి ప్రతి నెల 82 కోట్ల పింఛన్లు
    2014లో 1845 మందికి ఆసరా పింఛన్లు ఇస్తే… తెలంగాణ వచ్చిన తర్వాత కరీంనగర్ జిల్లాలోని 38,026 మందికి ప్రతి నెల 82 కోట్ల పింఛన్లు ఇస్తున్నారు. విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు 20 లక్షల ఓవర్సీస్ స్కాలర్ షిప్ అందిస్తున్నాని వెల్లడించారు.. తెలంగాణ రాకపోతే సంక్షేమ పథకాలు సాధ్యమయ్యేవాని అన్నారు.. బిజెపి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇప్పటికి మార్పురాలేదని అన్నారు. తెలంగాణ ప్రయోజనాలు కాపాడేది కేసీఆర్ మాత్రమేనాని అన్నారు.. కులవృత్తి పథకం డబ్బులను ప్రతినెల 15వ తేదీన లబ్ధిదారులకు అందిస్తాంని అన్నారు.. దళిత బందు లాగే ఇది కూడా నిరంతర ప్రక్రియఅని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు ఎంపీపీలు పిల్లి శ్రీలత, తిప్పర్తి లక్ష్మయ్య కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్ గౌడ్.. మార్కెట్ కమిటీ చైర్మన్ వెడ్డవేని మధు.. బారాసా నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్ ఆర్డిఓ ఆనంద్ కుమార్, బీసీ వెల్ఫేర్ అధికారి రాజ మనోహర్, ఎమ్మార్వోలు వెంకట్ రెడ్డి నారాయణ సుధాకర్ పలువురు సర్పంచులు ఎంపిటిసిలు పాల్గొన్నారు.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News