Wednesday, January 22, 2025

ముంపు గ్రామాల ప్రజలు ఆందోళన చెందొద్దు : హరీశ్‌ రావు

- Advertisement -
- Advertisement -

People of flooded villages should not worry: Harish Rao

 

హైదరాబాద్ : ముంపు గ్రామాల ప్రజలు ఆందోళన చెందవద్దని, అందరికి పూర్తిస్థాయి న్యాయం ముఖ్యమంత్రి కెసిఆర్ ఆధ్వర్యంలో చేస్తామని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. గురువారం హైదరాబాద్‌లో మల్లన్నసాగర్ ముంపు గ్రామం ఎర్రవెల్లి గ్రామ ప్రజలు మంత్రి హరీష్‌రావుతో భేటీ అయ్యారు. మల్లన్నసాగర్‌లో సర్వస్వం కోల్పోయామని, జలాశయం నిర్మాణం కోసం మొదటి నుంచి సహకరించామని మంత్రికి గ్రామస్తులు గుర్తుచేశారు. ఈ సందర్భంగా ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, పెండింగ్ సమస్యలపై ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి లేఖను మంత్రికి గ్రామస్తులు అందించారు. గ్రామస్తుల విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన మంత్రి హరీష్‌రావు వెంటనే జిల్లా కలెక్టర్‌కు, అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పెండింగ్ అంశాలను పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసిన చేశారు. త్వరలోనే మల్లన్నసాగర్ ముంపు గ్రామాలైన ఎర్రవెల్లి, మిగతా ఊర్లలో పట్టాలు స్వయంగా తానే పంపిణీ చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ముంపు గ్రామాల ప్రజలు ఆందోళన చెందవద్దని అందరికి పూర్తిస్థాయి న్యాయం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆధ్వర్యంలో చేస్తామని ధైర్యం చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News