Monday, December 23, 2024

తెలంగాణ ప్రజలకు సిఎం కెసిఆర్‌పై పూర్తి విశ్వాసం

- Advertisement -
- Advertisement -

జ్యోతినగర్: తెలంగాణ ప్రజలకు సిఎం కెసిఆర్‌పై పూర్తి విశ్వాసం ఉందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. రామగుండం దశాబ్ధి ప్రగతి ప్రజా చైతన్య యాత్రను రామగుండం కార్పొరేషన్ పరిధి 4వ డివిజన్‌లో ఎమ్మెల్యే చందర్ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి తిరుగుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏనాడు ప్రజల కష్టాలు పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు. పేదల కష్టాలు తెలిసి సిఎం కెసిఆర్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని అన్నారు. సిఎంగా కెసిఆర్ హ్యాట్రిక్ కొట్టాలని రాష్ట్ర ప్రజలు సైతం కోరుకుంటున్నారని అన్నారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ నడిపల్లి అభిషేక్ రావు, నాయకులు చెప్యాల రామారావు, కార్పొరేటర్లు కల్వచర్ల కృష్ణవేణి, కుమ్మరి శ్రీనివాస్, నాయకులు శంకర్ గౌడ్, జాహిద్ పాషా, అచ్చ వేణు, భరత్, అశోక్ తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News