Friday, December 20, 2024

తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి

- Advertisement -
- Advertisement -
  • ఎమ్మెల్యే అంజయ్యయాదవ్

షాద్‌నగర్: తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలంటూ శ్రీ విఠలేశ్వర స్వామికి, రుక్మిణి అమ్మవారికి షాద్‌నగర్ ఎమ్మెల్యే వై.అంజయ్య యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం మహారాష్ట్రలోని శ్రీ విఠలేశ్వర స్వామి, రుక్మిణి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అమ్మవారి పాదాల వద్ద కుంకుమార్చన చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వై.అంజయ్య యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజలతోపాటు షాద్‌నగర్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరు ఎల్లప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. మంత్రులు హరిష్‌రావు, జగదీశ్వర్‌రెడ్డి, శ్రీనివాస్ గౌడ్‌లతో కలిసి మహారాష్ట్రలో పర్యటించారు. సంబంధిత దేవాలయాల్లో రంగారెడ్డి జిల్లా పరిషత్ వైస్ చైర్మెన్ ఈట గణేష్, కొత్తూరు మున్సిపల్ చైర్ పర్సన్ బాతుక లావణ్య దేవేందర్ యాదవ్ ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు.

మహారాష్ట్రలో ముఖ్యమంత్రి కెసిఆర్ వెంట రెండు రోజుల పర్యటన అత్యద్బుతంగా జరిగిందని అన్నారు. అక్కడి ప్రజల నుండి విశేష స్పందన లభించిందని, తెలంగాణ అభివృద్ది, సంక్షేమ పథకాల అమలు తీరుపై జోరుగా చర్చలు కొనసాగుతున్నాయని వివరించారు. ఇందుకు తమకు ఎంతో సంతోషాన్ని కలిగించిదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌కు అడుగడుగునా మహారాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పడుతుండటం సంతోషాన్ని కలిగించిందని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News