Friday, January 10, 2025

తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడం స్వాగతిస్తున్నామని కేంద్ర మంత్రి, రాష్ట్ర బిజెపి అధ్యక్షులు కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం పార్టీ కార్యాలయంలో జహీరాబాద్ ప్రాంతానికి చెందిన ఢిల్లీ వసంత్, కొత్తగూడెం ఇల్లందుకు చెందిన కొందరు నేతలు పార్టీలో చేరారు. ఈసందర్బంగా మాజీ మంత్రి ఈటెల రాజేందర్‌తో కలిసి మాట్లాడుతూ పూర్తిస్థాయిలో ఎన్నికలు సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు ఎన్నికల్లో బిజెపి అధికారంలోకి రావడానికి అన్ని శక్తిసామర్థ్యాలను వినియోగిస్తామని తెలిపారు.

ప్రజల విశ్వాసాన్ని చూరగొని బిజెపి జెండా ఎగరేస్తామని రాష్ట్ర ప్రజలు కోరుకునే మార్పు తమ పార్టీతోనే సాధ్యమని ప్రధాని మోదీ నాయకత్వం పట్ల ప్రజల్లో ఎన్నో ఆశలున్నాయి తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నెలరోజుల పాటు మేమంతా కష్టపడి పనిచేసి విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం వస్తోందని తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పాలనను చూశారని ఉద్యమకారుల ఆకాంక్షలను కాంగ్రెస్ పార్టీ గౌరవించలేదని విమర్శించారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రభావం లేకుండా, అధికార దుర్వినియోగం లేకుండా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలని ప్రజలు కోరుకుంటున్నామన్నారు.

నేడు ఇంపీరియల్ గార్డెన్స్‌లో మేధావులు, విద్యావంతులనుద్దేశించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడతారని బుధవారం మేడారంలో ధన్యవాద సభ పెడుతున్నట్లు ములుగులో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు కానున్న సందర్భంగా పార్టీ గిరిజన మోర్చా ఆధ్వర్యంలో సమ్మక్కసారక్కల ఆశీర్వాదం తీసుకునేందుకు మేడారం వెళ్తుతున్నట్లు చెప్పారు. అనంతరం మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ప్రసంగిస్తూ అమరవీరులు కలలుగన్న బంగారు తెలంగాణను సాధించుకోవాలంటే బిజెపి అధికారంలోకి వస్తేనే సాధ్యమవుతుందన్నారు. తెలంగాణ చిన్నమ్మ పార్లమెంటు వేదికగా మన యువతకు ధైర్యం చెప్పారు. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలంగాణకు మా మద్దతు ఉన్నదన్న తర్వాతనే రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ వేగవంతం అయిందన్నారు. బిజెపిని రాష్ట్ర ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News