Thursday, January 23, 2025

భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

- Advertisement -
- Advertisement -

నల్గొండ:జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని బుధవారం జిల్లా ఎస్పీ కె. అపూర్వ రావు ఒక ప్రకటనలో తెలిపారు. వర్షం వల్ల ప్రయాణ సమయంలో వాహనాలు స్కిడ్ అయ్యే ప్రమాదం ఉందని, పరిమిత వేగంతో నడపాలని, అతివేగం వల్ల వాహనాలు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందన్నారు.

చెట్ల కింద, పాడైన భవనాలు కింద, శిధిలావస్థలో ఉన్న భవనాల్లో ఉండరాదన్నారు. అలాగే వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు కరెంటు వినియోగంలో జాగ్రత్తలు తీసుకోవాలని కరెంటు స్థంభాలు, ట్రాన్సాపార్మర్స్, ముట్టుకోరాదని కోరారు. ఉదృతంగా ప్రవహిస్తున్న వాగులు, కాలువలు, నదులు, రిజర్వాయర్లు, చెరువుల వద్ద కు వెళ్ళరాదన్నారు.

నది,నీటి వాగుల్లోకి చేపల వేటకు వెళ్లవద్దని తెలిపారు. పిల్లలను, వృద్ధులను ఒ ంటరిగా బయటకు పంపవద్దని చెప్పారు. ప్రజలు అత్యవసర సమయాల్లో మాత్రమే బయటకు వెళ్లాలని, పోలీసు శాఖ ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటుందిని, అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100కి కాల్ చేయాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News