Wednesday, November 6, 2024

నేడు రంజాన్ పండుగను ఘనంగా జరుపుకున్న ముస్లింలు!

- Advertisement -
- Advertisement -

Ramzan Eid
న్యూఢిల్లీ: దాదాపు రెండు సంవత్సరాల తర్వాత ఢిల్లీలోని జామా మస్జిద్‌లో మంగళవారం ఈదుల్ ఫిత్ర్  సందర్భంగా ముస్లింలు పెద్ద సంఖ్యలో నమాజు నిర్వహించారు. కాగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఉండేందుకు జామా మస్జిద్ వద్ద పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. “ఈద్ వేడుకలు శాంతియుతంగా జరిగేందుకు, శాంతిభద్రతలు సురక్షితంగా ఉండేందుకు తగినంత పోలీసు బలగాన్ని మొహరించాము” అని ఢిల్లీ ప్రత్యేక పోలీస్ కమిషనర్ దీపేంద్ర పాఠక్ తెలిపారు.

భారత దేశమంతటా మంగళవారం ఈదుల్ ఫిత్ర్  వేడుకలు ఘనంగా జరిగాయి. కాకపోతే రాజస్థాన్ లోని జోధ్‌పూర్‌లో మాత్రం లౌడ్‌స్పీకర్ల  విషయంలో అల్లర్లు జరిగాయని సమాచారం. ఈదుల్ ఫిత్ర్  సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ కూడా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో సోదరభావాన్ని చాటాలన్నారు. పవిత్ర రంజాన్ మాసం ముగిశాక ఈదుల్ ఫిత్ర్ ను  ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు జరుపుకుంటుంటారు. ఇస్లామీయ క్యాలెండర్ ప్రకారం రంజాన్ నెల తొమ్మిదవ నెల. ఈ నెలలో ముస్లింలు నెల రోజుల పాటు ఉపవాస దీక్షను పాటిస్తారు. ఈ పండుగ సందర్భంగా ముస్లింలు తమ బంధువులు, ఇరుగుపొరుగువారు, మిత్రులు, తెలిసిన వారికి సేమియా పాయసాన్ని అందిస్తారు. సాధారణంగా ‘షీర్‌ఖుర్మా’ పేరిట దీన్ని పిలుస్తుంటారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News