Wednesday, January 22, 2025

ఢిల్లీ ఎన్నికల్లో 50 శాతం పైగా బూత్‌లు గెలవాలి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో 50 శాతం పైగా బూత్‌లు గెలవడమే నగర బిజెపి సభ్యుల లక్షం కావాలని ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం కోరారు. ప్రజలు ఆప్ ప్రభుత్వంపై బాహాటంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని, ఆ పార్టీ వాగ్దానాలను వారు దానికి గుర్తు చేస్తున్నారని ఆయన తెలిపారు. ఢిల్లీ బిజెపి సభ్యులతో ఆన్‌లైన్‌లో మోడీ మాట్లాడుతూ, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) గుట్టు బట్టబయలైందని అన్నారు. ఆయన ఆ పార్టీని ‘ఆపద’గా పేర్కొన్నారు. ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో ఎదురుదెబ్బలు తగులుతున్నాయనే సమాచారాన్ని రోజూ అందుకుంటున్నందున ‘ఆపద’ ప్రతి రోజు కొత్త ప్రకటనలు చేస్తున్నదని ఆయన తెలిపారు.

‘పూర్వాంచల్’ ప్రాంతానికి చెందిన ప్రజలను దేశ రాజధాని నుంచి నెట్టివేయడానికి ఆప్ కుట్ర పన్నుతోందని, ఆ పార్టీకి వారిపై నిలువెల్లా ద్వేషం ఉందని ఆయన ఆరోపించారు. ఆ పార్టీ అబద్ధాలు, వంచనల్లో నిమగ్నమైందని, అది, కాంగ్రెస్ గత 25 ఏళ్లుగా భారీ ఎత్తున ప్రజలను నమ్మకద్రోహం చేశాయని మోడీ విమర్శించారు. గడచిన 25 ఏళ్లలో లేదా 3540 వయోవర్గంలో ఉన్నవారు విధ్వంసం తప్ప మరేమీ చూడలేదని, వారు ఆశ కోల్పోయారని, నిస్పృహలో ఉన్నారని మోడీ పేర్కొన్నారు. కేజ్రీవాల్‌పై మోడీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ, ఆప్ వంచనకు, అబద్ధాలకు ‘శీష్‌మహల్’ (అద్దాలమేడ) ప్రత్యక్ష ఉదాహరణ అని అన్నారు. కేజ్రీవాల్ అధికార నివాసాన్ని అద్దాలమేడగా బిజెపి అభివర్ణించింది. ఆ ఇంటిపై ఆయన కోట్లాది రూపాయలు ఖర్చు చేశారని బిజెపి ఆరోపించింది.

కేజ్రీవాల్ సారథ్యంలోని పార్టీని ఓడించాలని మోడీ పిలుపు ఇస్తూ, అభివృద్ధి చెందిన భారత్‌కు అభివృద్ధి చెందిన రాజధానిగా ఢిల్లీని తీర్చిదిద్దుతామన్న వాగ్దానాన్ని నెరవేర్చడానికి మార్గాన్ని అది సుగమం చేస్తుందని అన్నారు. ప్రజలకు నీరు వంటి కనీస అవసరాలను తీర్చడంలో నగర ప్రభుత్వం ‘విఫలమైంద’ని మోడీ విమర్శించారు. ‘మద్యం దొరుకుతోంది గానీ నీరు లభ్యం కావడం లేదు’ అన్న బిజెపి సభ్యుడు ఒకరితో మాట్లాడుతూ మోడీ ఆ విమర్శ చేశారు. ఆప్ బోగస్ ప్రకటనలు మాత్రమే చేస్తున్నదని, ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిని బిజెపి మెరుగుపరుస్తుందని ప్రధాని మోడీ చెప్పారు. తమ బూత్ కార్యకర్తల బలం ఆధారంగానే బిజెపి అఖండ విజయం సాధిస్తుందని ఆయన అన్నారు. ప్రజలు, ముఖ్యంగా మహిళలు పార్టీ ప్రచారానికి సారథ్యం వహిస్తున్నారని మోడీ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News