Monday, January 20, 2025

బాబు అరెస్టును ప్రజలు తిప్పి కొడతారు: సుహాసిని

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టిడిపి అధినేత, మాజీముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కుట్రపూరితంగా అరెస్టు చేశారని టిడిపి మహిళా నేత సుహాసిని తెలిపారు. చంద్రబాబుకు మద్దతుగా ఎన్‌టిఆర్ ఘాట్‌లో నందమూరి సుహాసిని దీక్ష చేపట్టారు. చంద్రబాబుపై ఎపి ప్రభుత్వం పెట్టిన కేసుల్లో ఆధారాలు లేవన్నారు. ఎపి ప్రభుత్వం లోకేష్‌ను సైతం ఇబ్బందులకు గురి చేస్తుందని దుయ్యబట్టారు. ఉమ్మడి ఎపిని చంద్రబాబు అభివృద్ధి బాటలో నడిపారని, బాబు అరెస్టును ప్రజలు తిప్పి కొడతారని వివరించారు. ఈ దీక్షలో పనబాక లక్ష్మీ పాల్గొన్నారు. అక్రమ కేసులు ఎత్తివేయాలని టిడిపి కార్యకర్తలు నినాదాలు చేపట్టారు. సైకో పోవాలి, సైకిల్ రావాలి అంటూ నినాదాలు చేశారు.

Also Read: ‘ఘోస్ట్’ ట్రైలర్ విడుదల..

ఎన్‌టిఆర్ ట్రస్ట్ భవన్‌లో ఎన్‌టిఆర్ కుటుంబ సభ్యులు నిరాహార దీక్ష చేపట్టారు. టిడిపి అధినేత, మాజీముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా ఎన్‌టిఆర్ కుటుంబ సభ్యులు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో బాలకృష్ణ సతీమణి వసుధర, గార్లపాటి లోకేశ్వరి, తారకరత్న భార్య అలేఖ్య, కుమార్తె నిష్క, నారా రోహిత్ తల్లి ఇందిర పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News