Thursday, January 23, 2025

మొదట్లో ప్రజలు మాటలతో కుంగదీశారు: నటుడు మనోజ్ బాజ్‌పేయి

- Advertisement -
- Advertisement -

ముంబై: విలక్షణ నటుడు మనోజ్ బాజ్‌పేయి. ‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’ అనే సినిమాలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. జాతీయ అవార్డు గెలుచుకున్న ఈ నటుడు తన తాజా ఇంటర్వూలో ‘నేను నటుడిగా ప్రయత్నిస్తున్న కాలంలో చాలా మంది నన్ను తిరస్కారం చూపులతో చూసేవారు. థియేటర్‌లో, బాండిట్ క్వీన్ వంటి సినిమాల్లో నటించి అనుభవం గడించినప్పటికీ నన్ను పెద్ద సీరియస్‌గా తీసుకునేవారు కాదు’ అన్నారు.
మనోజ్ బాజ్‌పేయి దాదాపు మూడు దశాబ్దాలుగా సినిమాల్లో నటిస్తున్నారు. సత్య(1998), గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్(2012), అలీగఢ్(2015) వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన సత్య, పింజర్(2003), భోంస్లే(2018) అనే సినిమాలకు నేషనల్ ఫిల్మ్ అవార్డ్ గెలుచుకున్నారు. ముంబైకి వచ్చిన తొలినాళ్లలో తాను ఎదుర్కొన్న విషయాలను ఆయన గుర్తుచేసుకుని తెలిపారు. నాడు 10 ఏళ్ల వరకు తాను నటకాల్లో నటించానని, తినడానికి కూడా తగినంత డబ్బు తన వద్ద ఉండేది కాదని అన్నారు.
ఆయన ఓ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో ఆడిషన్ సమయంలో తనను ఎంత చులకనగా చూసే వారో వివరించారు. ‘ముఖంపైనే చెప్పేసేవారు. మంచిదే అయింది…ముఖం మీదే చెపేసేవారు. అవకాశం ఇచ్చేవారు కాదు. దాంతో పెద్ద నటుడిని అయిపోతానన్న ఆశలు పెట్టుకునేవాడిని కాదు. జనం ముఖం మీదే హీరోలా లేదా విలన్‌లా కనిపించడం లేదనేసేవారు. దాంతో నాకు విలన్ పక్కన , హీరోకు మిత్రుడి పాత్రలో ఉంచేసేవారు’ అని ఆయన వివరించారు. చాలా కాలం వరకు తనకు ప్రచారకుడే లేడన్నారు. తన సినిమాలు తానే మార్కెట్ చేసుకున్నానన్నారు. పబ్లిక్ రిలేషన్ పని కూడా చేశానన్నారు.
మనోజ్ బాజ్‌పేయి నటించిన ఇటీవలి సినిమా ‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’. అది మే 23న విడుదలయింది. ఈ సినిమాకు ముందు ‘గుల్మొహర్’ సినిమాలో ప్రముఖ నటి షర్మీలా టాగూర్‌తో నటించారు. ఆ సినిమా మార్చి నెలలో డీస్నీ+హాట్‌స్టార్‌లో విడుదలయింది. ఆయన ప్రైమ్ వీడియో సీరీస్ ‘ద ఫామిలీ మ్యాన్’ థర్డ్ సీజన్‌లోనూ నటించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News