మనతెలంగాణ/ములకలపల్లి : అశ్వారావుపేట శాసన సభ్యులు మెచ్చా నాగేశ్వరరావు డిసింబర్ 2018 లో జరిగిన శాసన సభ ఎన్నికలలో ఎంఎల్‌ఎ గా డిసింబర్ 11 న ఎన్నికైనారు. ఆయన పదవి స్వీకారం చేసినది జనవరి నెల అయినప్పటికి ఎంఎల్‌ఎ గా ఎంపికైనది మాత్రం డిసింబర్ 11 నే. నేటితో మెచ్చా నాగేశ్వరరావు ఎంఎల్‌ఎ గా ఎంపికై 4 సంవత్సరాలు కాలం పూర్తి అయినది. ఈ నాలుగు సంవత్సరాల కాలంలో మెచ్చా నాగేశ్వరరావు నియోజక వర్గంలో కోట్ల రూపాయలతో అభివృద్ది, సంక్షేమ పధకాలను ప్రభుత్వం నుండి మంజూరు చేయించి వాటి ఫలాలను ప్రజలకు అందించారు.
కళ్యాణ లక్ష్మి, షాధిముభారక్, పధకాన్ని పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి కుటుంబానికి అందించడంలో మెచ్చా నాగేశ్వరరావు కు మరేవరు సాటిరారు. ఆపదలో ఉన్న కుటుంబాలకు ఆపధ్బాంధవుడై వారి వైద్య ఖర్చులను ముఖ్యమంత్రి సహయ నిధి నుండి మంజూరు చేయించడంలో మెచ్చా ముందున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధలిత బంధు పధకాన్ని ధలితులకు అందించి వారి ప్రేమానురాగాలను పొందారు. విధ్యుత్ సౌకర్యం లేని గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించడం, గ్రామాలలో అంతర్గత రహదారులు ఏర్పాటు చేయడం, ప్రభుత్వ వైద్యశాలలను అన్ని సౌకర్యాలతో ఆధునికరించడం, పాఠశాలలను అన్ని సౌకర్యాలతో ఆధునీకరణ, హాస్టల్ విద్యార్దులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, వంటి ప్రభుత్వ పధకాలను మంజూరు చేయించి అందరి మన్ననలను ఎంఎల్‌ఎ మెచ్చా పొందుతున్నారు.
ఏ పార్టి వారు తన దగ్గరకు వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించి వారికి పనులు చేసి పెట్టడం ద్వారా మెచ్చా అందరివాడుగా పేరు తెచ్చుకున్నారు. నిరంతరం నియోజకవర్గంలోని గ్రామాలలో పర్యటిస్తూ అటు పార్టిని, ఇటు ప్రజలను సమన్వయం చేసుకుంటు ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మెచ్చా నాగేశ్వరరావు పని చేస్తున్నారు. మెచ్చా నాగేశ్వరరావు ఎంఎల్‌ఎ గా పనిచేసిన ఈ నాలుగు సంవత్సరాల కాలంలో నియోజకవర్గంలోని ఏ మండలంలో కూడా పార్టిలో ఎలాంటి గ్రూపులు లేక పోవడం ఎంఎల్‌ఎ పనితీరుకు నిదర్శణం అని ప్రజలు, స్వంత పార్టి కార్యకర్తలు, నాయకులు బహిరంగంగానే పేర్కోంటున్నారు. అందరివాడుగా అబివృద్ది, సంక్షేమ మంత్రంతో పార్టీలకు అతీతంగా పనిచేస్తూ అందరిని కలుపుకొని పోతున్న ఎంఎల్‌ఎ మెచ్చా నాగేశ్వరరావు తిరిగి మల్లి ఎన్నికలలో ఎంఎల్‌ఎ గా ఎంపిక కావాలని నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నారు.