Wednesday, January 15, 2025

డీజే వివాదంతో పోలీస్ స్టేషన్‌కు నిప్పు

- Advertisement -
- Advertisement -

People Set Fire to Police Station in Bettiah

యువకుడు, కానిస్టేబుల్ మరణం

పాట్నా : బీహార్ లోని పశ్చిమ చంపారన్ జిల్లా బెతియాలో హోలీ సందర్భంగా ఏర్పాటు చేసిన డీజేతో తలెత్తిన వివాదం… స్థానిక యువకుడు, కానిస్టేబుల్ మరణానికి కారణమైంది. బెతియా సమీపం లోని ఆజ్రానగర్ గ్రామంలో హోలీ రోజు స్థానికులు డీజే ఏర్పాటు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు డీజే ఏర్పాటుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామానికి చెందిన అనిరుధ్ యాదవ్ అనే యువకుడిని స్టేషన్‌కు తీసుకెళ్లారు. అనంతరం ఆ యువకుడు బాల్‌ధార్ స్టేషన్ ఆవరణ లోనే మరణించాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన వందలాది గ్రామస్థులు పోలీస్ స్టేషన్‌ను చుట్టుముట్టి వాహనాలకు నిప్పుపెట్టారు.

కొందరు తుపాకులు పేల్చడంతో తూటా తగిలి ఓ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు. తర్వాత యువకుడి మృతదేహాన్ని పోలీస్ జీపుపై ఉంచిన గ్రామస్థులు ధర్నాకు దిగారు. పోలీసులు కొట్టడం వల్లనే యువకుడు మృతి చెందాడని ఆరోపించారు. బెతియా, బాల్ ధార్ రహదారిని దిబ్బంధించారు. పరిస్థితి అదుపు తప్పడంతో పశ్చిమ చంపారన్ ఎస్పీ ఉపేంద్రనాధ్ వర్మ, 2 వేల మంది పోలీసులను అక్కడికి తరలించారు. తేనెటీగలు కుట్టడం వల్లే యువకుడు చనిపోయినట్టు పోలీసులు తెలిపారు. హింసకు పాల్పడిన వారిని గుర్తించేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News