Monday, December 23, 2024

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

- Advertisement -
- Advertisement -

పెంచికల్‌పేట్: మండలంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో మండలంలో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవ్‌రావుల పర్యటించారు. మండల కేంద్రం సమీపంలోని పెద్దవాగుపై నిర్మిస్తున్న బ్రిడ్జి అప్రోచ్ రోడ్‌ను పరిశీ లించారు.

వచ్చే రెండు మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, కావున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. భారీ వర్షాలు ఉన్నందున వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు తలేత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకో వాలని ఆధికారులకు అదేశించారు. ఈ కార్యక్రమంలో మండల అద్యక్షులు చౌదరి తిరుపతి, కోఅప్షన్ సభ్యులు సాజిద్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News