Thursday, January 23, 2025

ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

- Advertisement -
- Advertisement -

కుత్బుల్లాపూర్: గత కొద్దీ రోజులుగా కురుస్తున్న వర్షాల ఎ లాంటి ఇబ్బందులు ఎదురైనా నియోజకవర్గ అన్ని ప్రభుత్వ శాఖల సిబ్బంది సిద్ధంగా ఉన్నారని, గత కొద్దీ సంవత్సరాల నుంచి చేపడుతున్న అభివృద్ధి పనుల వల్ల దాదాపు నియోజకవర్గంలో వరద నీటి తాకిడి తట్టుకోగలిగామ ని అలాగే నిర్మాణ దశలో వున్న పనులను కూడా పూర్తిచేసేలా చర్యలు చేపడుతున్నామని, ముఖ్యమంత్రి కెసిఆర్, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ సహకారంతో నియోజకవర్గంలో వందల కోట్ల రూపాయలతో వరదనీటి కాలువలు, మురుగునీటి కాలువలు, అలాగే కల్వర్టులు, బాక్స్ డ్రైన్ల్ నిర్మాణాలు చేపడుతున్నామని ఎమ్మెల్యే శనివారం 130 సుభాష్ నగర్ డివిజన్ పైపులైను రోడ్డులోని మిత్ర హోమ్స్ గల ముంపు ప్రాంతాన్ని అధికారులతో కలిసి సందర్శించిన సందర్బంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అ ధ్యక్షులు పోలె శ్రీకాంత్, రుద్రా అశోక్, పుప్పాల భాస్కర్, సీనియర్ నాయకులు సంపత్ మాధవ రెడ్డి, కస్తూరి బాల రాజు, గౌస్‌ఉద్దీన్, ఇస్మాయిల్ మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News