Wednesday, December 25, 2024

భారీ వర్షాలుపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

- Advertisement -
- Advertisement -

సిరిసిల్ల: సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపద్యంలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అనురాగ్ జయంతి కోరారు. బుధవారం ఆయన మాట్లాడుతూ జిల్లాలో మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశాలున్నందువల్ల చెరువులు, వాగుల పరిసరాల్లోని ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, పురాతన శిథిల భవనాలు, గోడలు కూలిపోయే పరిస్థితులు ఉన్నట్లయితే అక్కడి నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు.

జిల్లాలోని మానేరు, మూలవాగు,నక్కవాగు పరిసరాల్లోకి, మత్తడి పొంగే చెరువులు, కుంటల వద్దకు ప్రజలు వెళ్లకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అధికారులందరూ సంబందిత హెడ్‌క్వార్టర్లలో ఉండి ప్రజలకు ఏ సమస్య రాకుండా చూసుకోవాలన్నారు.లోతట్టు వంతెనల వద్ద నీటి ప్రవాహం పెరిగితే బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. విద్యుత్ వైర్లు తెగిపడితే వెంటనే మరమ్మత్తులు చేయించాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News