Sunday, January 19, 2025

భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి:భారీ వర్షాల దృష్ట్యా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కోరారు. బుధవారం ఆమె జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లతో గూ గుల్ మీట్ ద్వారా పరిస్థితులను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె భారీ వర్షాల వలన తీసుకోవాల్సిన చర్యలపై పలు ఆదేశాలను జారీ చేశారు.

జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నందున ఎటువంటి సంఘటనలు ఎదురైనా స మర్థవంతంగా ఎదుర్కొవడానికి అధికారులు సిద్ధంగా ఉండాలని ఆదేశించా రు. ముఖ్యంగా పోచంపల్లి, బీబీనగర్, వలిగొండ, రాజాపేట, మోత్కూర్, అడ్డగూడూర్, గుం డాల తహసిల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు అప్రమత్తంగా ఉండి తగిన చర్యలు తీసుకోవాలని, లోతట్టు ప్రాంతాలలో, చెరువులు, వాగు తీర ప్రా ంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేయాలనీ, వరద నీరు వచ్చే ప్రాంతాలు, మత్తడులు దూకే ప్రాం తాల వద్ద అధికారులు అప్రమత్తంగా ఉంటూ నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు.

అత్యవసర పరిస్థితులలో ఉ న్న ప్రజల సాయానికి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ నెం బర్ 08685 – 293312 ఏర్పాటు చేయడం జరిగిందని, 24 గంటలు అత్యవసర సేవల కొరకు ప్రజలు సంప్రదించ వచ్చని ఆమె తెలిపారు.గూగుల్ మీట్ కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ ఏ.భాస్కరరావు, జిల్లా అధికారులు, తహసిల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News