Wednesday, January 22, 2025

వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట:రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా కోదాడ పట్టణం లోని 27, 33వ వార్డులను కలు పుకుని ఉన్న ఎర్రకుంట వాగు బ్రిడ్జికి కొట్టు వచ్చిన గుర్రపు డెక్క, సిల్ట్‌ని జేసి సహాయంతో తొలగించే పనులను, అనంగతిరి రోడ్‌లోని పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నటువంటి గూనలలో ఇరుక్కుపోయిన చెత్తచెదారాన్ని తొలగించే పనులను కోదాడ మున్సిపల్ ఛైర్‌పర్స్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ బుదవారం పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వాతావరణ శాఖ వారి సమాచారం ప్రకారం వచ్చే రెండు మూడు రోజులు కూడా ఇలానే భారీ వర్షాలు కురిసే అకాశం ఉన్నందున క్షత్రస్థాయిలో అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ప్రజలకు ఇబ్బంది కలగకుండా సమస్యలు ఎదురుకాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

అత్యవసర పరిస్థితుల్లో మున్సిపల్ శాఖ వారిని 8374450353 నెంబర్‌ను సంప్రదించాలని, ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ ఎస్కే షాబుద్దీన్, మాజీ కౌన్సిలర్ ఎండి ఉద్దండు, సానిటరీ ఇన్‌స్పెక్టర్ యాదగిరి, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News