సిద్దిపేట క్రైమ్ : సైబర్ నేరగాళ్లతో జాగ్రత్త, ఆన్‌లైన్ వేదికగా సైబర్ నేరగాళ్లు ఆమాయకులను మోసం చేస్తూన్నారని సీపీ శ్వేత అన్నారు.ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ సోషల్ మీడియాలో స్నేహితులు, బంధువుల పేర్లపై అకౌంట్ క్రీయెట్ చేసి అత్యవసరంగా డబ్బులు సాయం కావాలని లక్షలు , కోట్ల విలువ చేసే లాటరీ తగిలిందని ముందుగా కొంత డబ్బు కట్టాలని మోసం చేయడం వారి మాటలు నమ్మి మోసపోయిన అమయాకుల అకౌంట్‌లలో నుండి డబ్బులు కాజేయడం చేస్తున్నారు.
సైబర్ నేరాలను నివారించాలనే ఉద్దేశంతో నేషనల్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ గురించి పోలీస్ అధికారులు సిబ్బంది, పోలీస్ కళాబృందం, కనువిప్పు అనే కార్యక్రమం ద్వారా పట్టణాల్లో, గ్రామాల్లో అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. సైబర్ నేరాల్లో మీరు డబ్బులు పొగొట్టుకున్నారా అయితే వెంటనే జాతీయ హెల్ఫ్‌లైన్ ట్రోల్ ఫ్రీ 1930 పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న వెబ్ పోర్టల్‌కు లేదా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి.
అలా చేస్తే పోగొట్టుకున్న సోమ్మును సైబర్ నేరగాని ఖాతాల నుండి బదిలీ కాకుండా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. సైబర్ నేరగాళ్ల ఖాతాల్లో డబ్బు ఉన్పప్పుడు వెంటనే బ్యాంక్ అధికారులను అప్రమత్తం చేసి వాటిని ప్రీజ్ చేస్తారు. మోసం జరిగిన వెంటనే 24 గంటల లోపే ఫిర్యాదు చేస్తే ఇది సాద్యమవుతుందని తెలిపారు. 2023 సంవత్సరంలో ఈ రోజు వరకు రూ. 46,55,956 లక్షల రూపాయలను ప్రీజ్ చేసినట్లు తెలిపారు. త్వరలో వారి వారి అకౌంట్లలో డబ్బులు జమ చేస్తామని తెలిపారు.