Saturday, December 21, 2024

ముసురుతో ప్రజలు అప్రమతంగా ఉండాలి

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట: మునగాల మండలంలో గత నాలుగు రోజులుగా ముసురుతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు రెడ్ అలెర్టుగా ప్రకటించినందున మంగళవారం జిల్లా కలెక్టర్ వెంకట్రావ్ వర్ష ప్రభావ పరిస్థితులను పెంచుకొనేందుకు మండలంలో అకస్మిక పర్యటన చేశారు. స్థానిక తాసీల్థార్ కార్యాలయంను సందర్శించి అధికారులు మరియు ప్రజా ప్రతినిధులతో వర్షప్రభావ పరిస్థితులను సమీక్షించారు.

గ్రామపంచాయతీ కార్మికుల నిరవధిక సమ్మె చేస్తున్నందున గ్రామాలల్లో శానిటేషన్, మంచినీటి సౌకర్యం, పల్లె ప్రకృతి నిర్వహణకు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లే కుండా చూడాలని ఆదేశించారు. ఓటర్ నమోదుపై అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. మన ఊరు, మన బడి కార్యక్రమంలో చేపట్టిన పనులను త్వరతగతిన పూర్తిచేయాలని అన్నారు.

పాఠశాలల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. అభివృద్ధి పనులపై అధికారులు నిర్లక్షం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వర్షాలు భారీగా కురుస్తున్నందున ప్రజలకు అందుబాటులో ఉ ంటూ అవసరాన్ని బట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం జిల్లా మండల కేంద్రంలో ఉన్న జడ్పీహెచ్ హైస్కూల్ పరిశీలించి తరగతి వెళ్లి విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News