Thursday, January 23, 2025

ప్రజలకు స్పష్టమైన అవగాహనను కల్పించాలి

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా ఓటు వినియోగాన్ని గురించి జిల్లాలో ప్రతి ఒక్కరికి స్పష్టమైన అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆర్‌వి కర్ణన్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ఎఈఓ, ఎస్‌ఓలకు కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూ నిట్, వివిపాట్‌ల ద్వారా ఓటు వినియోగంపై ప్రజలకు ఇవ్వాల్సిన అవగాహన, చేపట్టాల్సిన జాగ్రత్తలపై నిర్వహించిన శిక్షణ కా ర్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూ నిట్, వివిపాట్‌ల ద్వారా ఓటు వినియోగం గురించి ప్రజలకు స్పష్టతను ఇచ్చి అవగాహనను కల్పించే దిశగా (20 జూలై 2023) గురువారం నుండి ప్రారంభించనున్న అవగాహన కార్యక్రమాలను సిబ్బంది విజయవంతం చేయాలన్నారు.

జిల్లా అదనపు కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్ లాల్ మాట్లాడుతూ ఓటు వేసిన తరువాత ఓటరుకు ఆ ఓటు ఎవరికి పడిందో తెలియజేయడానికి ఎన్నికల కమీషన్ వివిపాట్‌లను ప్రవేశపెట్టిందని తెలిపారు. వర్షం, ఎండ, ఎక్కువగా వెలిగే విద్యుత్ లైట్ల వద్ద వివిపాట్‌లను ఉంచరాదని, ఈ పరికరాలు ఇంటర్‌నెట్, వైపై, బ్లూటూత్ ద్వారా ఆపరేట్ చేయడానికి సాధ్యపడదని, ఇది క్యాలిక్యూలేటర్‌కు సమానమైందనే విషయాన్ని ప్రజలకు స్పష్టంగా అర్థం అయ్యేలా వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శిక్షణ సహాయ కలెక్టర్ వత్సల్ లెనిన్ టోప్సో, కరీంనగర్ ఆర్డీవో కె మహేష్, కలెక్టరేట్ ఎఓ జగత్‌సింగ్, కొత్తపల్లి తహసిల్దార్ వెంకట్‌రెడ్డిలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News