Wednesday, January 8, 2025

అభివృద్ధిని పనులపై ప్రజలకు అవగాహన కల్పించాలి

- Advertisement -
- Advertisement -

తుర్కయంజాల్: నగరానికి కూతవేటు దూరంలో ఉన్న గ్రామాలను అనాడు అభివృద్ధి చేపట్టాలనే ఉద్ధేశంతో నియోజకవర్గంలో 4 మున్సిపాలిటీలను ఏర్పాటు చేసినట్లు ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా పట్టణ ప్రగతి వారోత్సవాలు తుర్కయంజాల్ మున్సిపాలిటీలోని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. తుర్కయంజాల్ కూడలీ నుంచి ఇంజాపూర్ వరకు కమీషనర్ సాబేర్ అలీ ఆధ్వర్యంలో వాహణాలతో భారీగా ర్యాలీ నిర్వహించి పురపాలికలో చేపట్టిన అభివృద్ధి పనులపై అవగాహన కల్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశానికి ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి ముఖ్యఅతిధిగా హాజరై జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో గ్రామాలు ఉన్న సమయంలో కరెంట్, త్రాగునీరు, విద్యుత్, డ్రైనేజీ వ్యవస్థ సమస్యలు తీవ్రంగా ఉండేది. కావున 9 గ్రామాలు కలుపుకొని తుర్కయంజాల్ మున్సిపాలిటీ ఏర్పాటు చేసినట్లు వివరించారు.

రూ. 96 కోట్ల నిధులతో తుర్కయంజాల్, 45 కోట్లతో పెద్ద అంబర్‌పేట్, 16 కోట్లతో ఆదిబట్ల మున్సిపాలిటీలకు మిషన్ భగీరథలో భాగంగా ఇం టింటా తాగునీరు అందించినట్లు పేర్కొన్నారు. దీంతో పాటు రూ. 30 నుండి 35 కోట్ల నిధులతో తుర్కయంజాల్‌లో అభివృద్ధి పనులకు ఖర్చు చేసినట్లు తెలిపారు. ప్రజా ప్రతినిధులు అభివృద్ధ్దిలో పోటీ పడాలి కానీ అడ్డు పడే పనులు మాను కొవాలని సూచించారు. మనం చేసే పనులు ప్రజలు గమనిస్తుంటారు. కావున 5 సంవత్సరాలలో చేపట్టిన పనులు ప్రజలకు తెలియజేయాలన్నారు. మున్సిపాలిటీలో మెరుగైన వైద్యం అందించాలనే తపనతో 5 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అభివృద్ధి చేపడితేనే ప్రజలు గుర్తిస్తారని హితపు పలికారు.

వారం లోపల 6 కోట్ల నిధులు అందిస్తా….. మున్సిపాలిటీ అభివృద్ధికి తన నిధుల నుండి అందజేస్తున్నట్లు ఎమ్మెల్యే సమావేశంలో ప్రకటించారు. రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ ఉపయోగించుకోవాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో నోడల్ అధికారి, ఇబ్రహీంపట్నం ఆర్‌డిఓ వెంకటచారీ, మెప్మా పిడి. ఎండి సఫీ ఉల్లా, జిల్లా డిసిసిబి వైస్ ఛైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య, జిల్లా గ్రంధాలయ ఆధ్యక్షుడు సత్తు వెంకటరమణరెడ్డి, జిల్లా రైతు బందు సమితి ఆధ్యక్షుడు వంగేటి లకా్ష్మరెడ్డి, తహశీల్దార్ అనితారెడ్డి, మాజీ సర్పంచ్ కందాడ లకా్ష్మరెడ్డి, కౌన్సిలర్‌లు కళ్యాణ్‌నాయక్, వేముల స్వాతి అమరేందర్‌రెడ్డి, పులగుర్రం కీర్తన విజయానంద్‌రెడ్డి, సిద్దాల జ్యోతి, గుండ భాగ్యమ్మ, తాళ్లపల్లి సంగీత, మున్సిపాలిటీ పార్టీ ఆధ్యక్షుడు అమరేందర్‌రెడ్డి, నాయకులు చేవుల దశరథ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News