Wednesday, January 22, 2025

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మెదక్ కలెక్టర్ రాజర్షి షా

- Advertisement -
- Advertisement -

మెదక్: ఇంకా మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రమాద హెచ్చరికలు పాటించాలని మంగళవారం జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. వాతవరణ శాఖ హెచ్చరికలు దృష్టిలో ఉంచుకుని జిల్లా స్థాయి అధికారులు, మ ండల స్థాయి అధికారులు సిబ్బంది హెడ్ క్వార్టర్‌లో ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. శిథిలావస్థ లో ఉన్న ఇండ్లలో ఉండవద్దని తాత్కాలిక పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలని అన్నారు. వర్షాలకు నాని ఉన్న కరెంట్ స్థభాలను ముట్టకోవద్దని హెచ్చరించారు. పశువులు కరెంట్ స్థంభాల వద్దకు వెళ్లకు ండా వాటిని కాపాడుకోవాలని తెలిపారు. కాచి చల్లార్చిన వేడి నీటినే తాగాలని అన్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున పరిశుభ్రత పాటించాలన్నారు.

పరిసరాల్లో నీ టి నిల్వలు లేకుండా చూసుకోవాలని, వైద్య, మున్సిపల్, పంచాయతీ శాఖల సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో చె త్తను డోర్ టు డోర్ కలెక్షన్ చేయాలని, ఎప్పటికప్పు డు బ్లీచింగ్ చేయాలని,శానిటేషన్ పూర్తిస్థాయిలో జ రగాలని అన్నారు. ప్రజల కోసం అత్యవసర సేవల కోసం కార్యాలయంలో కంట్రోల్ రూమ్‌కూడా ఏ ర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కంట్రోల్‌రూమ్ నం. 9391942254, సిబ్బంది 24 గం టలు అందుబాటులో ఉంటారని, అలాగే కరెంట్ సమస్యల పరిష్కారం కోసం 24 గంటలు కంట్రోల్ రూం ఏర్పాటు చేయడం జరిగిందని కంట్రోల్ రూం నంబర్ 7901677782కు ఫోన్ చేయాలని ఎలక్ట్రికల్ సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. అత్యవసర సేవలకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News