Monday, December 23, 2024

గ్యారంటీలతో వచ్చే పార్టీలను ప్రజలు ప్రశ్నించాలి

- Advertisement -
- Advertisement -
  • కర్ణాటక ప్రజలకు పట్టిన దుస్థితి మనకు వద్దు
  • మీకు సేవ చేసే అవకాశం మరోసారి కల్పించాలి
  • పనిచేసే ప్రభుత్వం ఏదో ప్రజలు గమనించాలి
  • భూపాలపల్లి ఎంఎల్‌ఏ గండ్ర వెంకటరమణారెడ్డి

భూపాలపల్లి టౌన్: గ్యారంటీల పేర్లతో ప్రజలను మభ్యపెడుతున్న పార్టీలను గ్రామాలకు వస్తే ప్రజలు ప్రశ్నించాలని భూపాలపల్లి ఎంఎల్‌ఏ గండ్ర వెంకటరమణారెడ్డి, మాజీ మంత్రి, ఎంఎల్‌సి, ఎన్నికల ఇన్‌చార్జి బస్వరాజు సారయ్య అన్నారు. గురువారం శాయంపేట మండలంలోని గట్ల కనిపర్తి, సూరంపేట, మందారిపేట, గోవిందాపూర్ గ్రామాలలో వరంగల్ జిల్లా జడ్పి చైర్‌పర్సన్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా బిఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎంఎల్‌ఏ గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ అభివృద్ధికి మాయమాటలకు నడుమ జరిగే ఎన్నిక ఇది అని, మీరిచ్చిన ఈ సదవకాశాలను పూర్థి స్థాయిలో సద్వినియోగం చేసుకొని అన్ని విధాలుగా అభివృద్ధి చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ దొంగ హామీలు ఇస్తుందని, నిస్సిగ్గుగా రైతుల సంక్షేమాన్ని వద్దని ఎన్నికల సంఘానికి రైతుబంధు వద్దంటున్న కాంగ్రెస్ పార్టీని ప్రజలు ప్రశ్నించాలన్నారు.

ముఖ్యమంత్రి నాడు ఎన్నికల మ్యానిఫెస్టోలో లేని కొత్త పథకాలను అమలు చేశారని, దళితబంధు, బిసి బంధు, గృహలక్ష్మి పథకాలను అందిస్తున్నట్లు తెలిపారు. రానున్న 5 ఏండ్లకు ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన మ్యానిఫెస్టోలోని ప్రతి గెలిచిన తొలి నెల నుండి అమలు చేస్తామని, కార్యకర్తలు అందరూ సమిష్టిగా పనిచేసి పార్థీ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎంఎల్‌సి బస్వరాజు సారయ్య మాట్లాడుతూ శాయంపేట మండలాన్ని అన్ని విధాలా అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన నాయకుడు గండ్ర వెంకటరమణారెడ్డి అని అన్నారు.

గ్రామాలలో ప్రతి ఒక్కరు అభివృద్ధి, సంక్షేమ పథకాలపై చర్చ జరపాలని, నాడు ఉన్న పరిస్థితి నేడు ఉన్న పరిస్థితి ప్రజలకు కార్యకర్తలు వివరించాలని, రైతుబంధు వద్దంటున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలే బుద్ది చెప్పాలని, ప్రతి సారి పాలకువిగా కాకుండా సేవకుడిగా మెదిలిన నాయకుడు గండ్ర వెంకటరమణారెడ్డి అని, రాష్ట్రంలో బిఆర్‌ఎస్ అనుకూల వాతావరణం ఉందని, రమణారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించి మరల అసెంబ్లీకి పంపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News