Monday, December 23, 2024

కంటి వెలుగును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

- Advertisement -
- Advertisement -
  • మేడ్చల్ మున్సిపల్ చైర్‌పర్సన్ దీపిక నర్సింహ్మరెడ్డి

మేడ్చల్ : మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని 23వ వార్డులోని రైతు బజార్ మార్కెట్ కమిటీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని 23వ వార్డు కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమతో కలిసి మేడ్చల్ మున్సిపల్ చైర్ పర్సన్ మర్రి దీపికా నర్సింహ్మరెడ్డి సోమవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కౌన్సిలర్ కౌడే మహేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కంటిచూపు సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు వైద్యసేవలు అందించేందుకు సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని రూపొందించారని అన్నారు. ప్రభుత్వం ఉచితంగా ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి, కళ్లద్దాలు, అవసరమైన వారికి శస్త్రచికిత్సలు, మందులను అందజేస్తుందని అన్నారు.18 ఏండ్లు పైబడిన ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మేడ్చల్ పట్టణ మాజీ ఉప సర్పంచ్ మర్రి నర్సింహ్మరెడ్డి, మేడ్చల్ మున్సిపాలిటీ 23వ వార్డు బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు కౌడే శ్రీశైలం, ఆర్పీలు బాలమణి, అనిత, నాయకులు, కార్యకర్తలు, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News