Thursday, December 19, 2024

ఆంధ్రలో లారీ బోల్తా…బీర్ బాటిల్స్ కోసం ఎగబడ్డ జనం

- Advertisement -
- Advertisement -

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లాలో ఆల్కాహాల్ పెట్టెలు తీసుకెళ్తున్నలారీ బోల్తాపడింది. సోమవారం అనకాపల్లి నుంచి బయ్యవరం మధ్య ఉన్న జాతీయ రహదారిలో ఈ ఘటన చోటుచేసుకుంది. బీర్‌బాటిల్స్ ఉన్న 200 పెట్టెలు నేలపాలయ్యాయి. బోల్తాపడ్డ లారీకి సాయం అందించకపోగా అక్కడి స్థానికులు బీర్ బాటిల్స్ ఎత్తుకుపోడానికి ఎగబడ్డారు. కాగా లారీ డ్రైవర్, క్లీనర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఆ లారీ బోల్తా పడ్డ ఫుటేజి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News