Saturday, November 23, 2024

చూడకముందే సినిమాలపై తీర్పు ఇస్తున్నారు: ఎఆర్ రెహ్మాన్

- Advertisement -
- Advertisement -

ముంబై: చూడకముందే సినిమాలపై ప్రజలు తీర్పు ఇవ్వడం దురదృష్టకరమని ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు విజేత ఎఆర్ రెహ్మాన్ వ్యాఖ్యానించారు. తాను సంగీత దర్శకత్వం వహించిన గాంధీ గాడ్సేఈ: ఏక్ యుద్ధ్ చిత్రం ప్రమోషన్ కార్యక్రమంలో ఆయన బుధవారం నాడిక్కడ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈచిత్రాన్ని వారు చూడలేదు.. ఈ చిత్రం ఒక పక్షానికి కొమ్ము కాస్లోందని భావిస్తున్నారు.. దర్శకులు ఏదో ఒక పక్షానికి కొమ్ముకాస్తున్న కారణంగానే ప్రజలు చిత్ర దర్శకులను నమ్మడం మానేశారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

రాజ్‌కుమార్ సంగోషి దర్శకత్వం వహించిన గాంధీ గాడ్సేఈ: ఏక్ యుద్ధ్ చిత్రం విడుదలకు ముందే వివాదాలు సృష్టిస్తోంది. ఈ చిత్రంలో మహాత్మా గాంధీని తక్కువ చేసి చూపించారని, ఆయన హంతకుడు నాథూరాం గాడ్సేను ఉన్నతంగా చిత్రీకరించారని కొందరు వాదిస్తుండడంపై వివాదం చెలరేగుతోంది. కాగా.. ఇదే అంశాన్ని ఎఆర్ రెహ్మాన్ ప్రస్తావిస్తూ దురదృష్టవశాత్తు ఈ చిత్ర దర్శకుడు రాజ్‌కుమార్ సంతోషి బాధితుడిగా మారుతున్నారని వ్యాఖ్యానించారు. ఘాయల్, అందాజ్ అప్నా అప్నా, ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన సంతోషి రూపొందించిన తాజా చిత్రం గాంధీ గాడ్సేఈ: ఏక్ యుద్ధ్ గురువారం థియేటర్లలో విడుదలవుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News