Tuesday, January 21, 2025

ఊరెళ్దాం.. ఓటేద్దాం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడానికి సొం తూళ్లకు బయల్దేరారు. ఉద్యోగులకు శని, ఆదివారా లు సెలవు కావడం, సోమవారం ఎన్నికల హాలిడేను ప్రకటించడంతో వేలాదిగా సొంత ఊర్లకు తరలివెళుతున్నారు. దీంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో రద్దీగా మారిపోయాయి. రాష్ట్రంలో రేపే పోలిం గ్ కావడంతో ఓటు హక్కు వినియోగించుకునేం దుకు ప్రజలు వారి సొంత గ్రామాల బాటపడుతున్నా రు. వీకెండ్ కావడం, పోలింగ్‌కు కేవలం రెండు రోజులే సమయం ఉండటంతో నగరంలో నివసించే ప్రజలు తమ సొంతూళ్లకు పరుగులు తీస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పలుచోట్ల ట్రాఫిక్ జాం ఏర్పడింది. దీంతో హైదరాబాద్ శివారు ప్రాంతమైన హయత్‌నగర్ నుంచి అబ్దుల్లాపూర్‌మెట్ వరకు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడడంతో జాతీయ రహదారి వాహనాలతో కిక్కిరిసిపోయింది. ఈ నెల 13వ తేదీన ఎన్నికలు ఉండటంతో తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రజలు సొంతూళ్లకు తరలివెళ్తున్నారు.

కష్టతరమైన ప్రయాణం
ఓటు హక్కు వినియోగించుకునేందుకు సొంత ఊర్లకు వెళ్లే వారికి ప్రయాణం కష్టతరంగా మారింది. ముందుగా బుక్ చేసుకుందామనుకున్నప్పటికీ ఇప్పటికే బస్సు, రైల్ టికెట్లు ఫుల్ కావడంతో ఏదో విధంగా సొంత ఊర్లకు వెళ్లడానికి బస్సులు, రైళ్ల వద్దకు ప్రయాణికులు చేరుకోవడం విశేషం. ప్రయాణికులు పెరగడంతో రెండు తెలుగు రాష్ట్రాల ఆర్టీసిలు ప్రత్యేక బస్సులను నడుపుతుండగా, దక్షిణమధ్య రైల్వే కూడా ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఎపికి ఇప్పటికే ప్రకటించిన బస్సుల్లో, రైళ్లలోనూ సీట్లన్నీ రిజర్వ్ అయ్యాయి. మరిన్ని బస్సులు పెంచితే బాగుంటుందని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. ఉప్పల్, ఎల్‌బినగర్ నుంచి దాదాపు 600 బస్సులను ఆంధ్రప్రదేశ్‌తో పాటు వరంగల్, హన్మకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి, తదితర ప్రాంతాలకు బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసి అధికారులు చెప్పారు. ప్రైవేటు బస్సులైతే ఏకంగా మూడు రెట్లు ఎక్కువగా ఛార్జీని వసూలు చేస్తున్నాయని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. దీంతో ప్రయాణం చేయడానికి తాము ఇబ్బందులు పడుతున్నామని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రద్దీగా మారిన ఎల్బీనగర్ బస్టాండ్
ఎల్బీనగర్‌లోని విజయవాడ జాతీయ రహదారి బస్టాండ్ వద్ద ఆర్టీసి బస్సులు తక్కువగా ఉండటంతో ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎల్బీనగర్ బస్టాండ్ ప్రయాణికులతో కిక్కిరిసి పోయింది. దీంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది.
మూడురోజులు 1,400ల సర్వీసులు…
ప్రయాణికుల రద్దీ పెరగడంతో హైదరాబాద్ నుంచి తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు ఆర్టీసి ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఈ నెల 10, 11, 12 తేదీల్లో 400 బస్సులకు ప్రయాణికులు ముందస్తుగానే రిజర్వేషన్లు చేసుకున్నట్లు ఆర్టీసి అధికారులు తెలిపారు. అదనంగా మరో 150కి పైగా ప్రత్యేక బస్సులను 10వ తేదీన ఆన్‌లైన్‌లో పెట్టినట్లు అధికారులు పేర్కొన్నారు. తెలంగాణ జిల్లాలకు 10, 11 12 తేదీల్లో 1,400 సర్వీసులను ఆర్టీసి ప్రత్యేకంగా నడుపుతోందని అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News