Thursday, January 23, 2025

ప్రజలల్లో నిత్యం ఉండే నాయకులను ప్రజలు ఎప్పుడు మరచి పోరు : మంత్రి మల్లారెడ్డి

- Advertisement -
- Advertisement -

బోడుప్పల్: ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకొని వారి సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకున్న వారిని ప్రజలు ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకుంటారని వారికి రాజకీయ భవిష్యత్తు ఎప్పుడూ ఉంటుందని తెలంగాణ రాష్ట్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం పీర్జాదిగూడ నగర పాలక సంస్థ పరిధిలోని 5వ డివిజన్ బీపీఎం గ్రీన్ ల్యాండ్స్ కాలనీ, భూ లక్ష్మీ నగర్ కాలనీ లలో సుమారు రూ. 50 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించనున్న భూగర్భ డ్రైనేజీ లకు మంత్రి చామకూర మల్లారెడ్డితో పాటు , మేడ్చల్ మల్కాజ్గిరి గ్రంధాలయ సంస్థ, పిర్జాదిగూడ బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు దర్గ దయాకర్ రెడ్డి, నగర పాలక సంస్థ మేయర్ జక్కా వెంకట్ రెడ్డి, డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్, , స్థానిక కార్పొరేటర్ బొడిగె స్వాతి కృష్ణ గౌడ్ తో కలిసి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… పీర్జాదిగూడ కార్పొరేషన్ లో కార్పొరేటర్లు పోటీ తత్వంతో పని చేస్తున్నారని అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారని వారికి అభినందనలు తెలిపారు. 5వ డివిజన్ కార్పొరేటర్ బొడిగె స్వాతి కృష్ణ గౌడ్ అహర్నిశలు ప్రజల కోసం కష్టపడుతూ అందరి మన్ననలు పొందుతున్నారని పేర్కొన్నారు. నారాయణ కత్వా కాలువకు కూడా పరిష్కారం చూపుతానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బొడిగె కృష్ణ గౌడ్ ఐదవ డివిజన్ అధ్యక్షులు గున్నాల అశోక్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ సత్తిరెడ్డి, బద్దం అంజిరెడ్డి బిపిఎం గ్రీన్ ల్యాండ్స్ కాలనీ అధ్యక్షులు మునుకుంట్ల నరేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి రావు నాగిరెడ్డి, కోశాధికారి గుత్తి వెంకటరమణ, ఉపాధ్యక్షులు మునుకుంట్ల ప్రదీప్ గౌడ్, రాపల్లి వేణు, కార్యదర్శి సిద్ది పరమేశ్వర్, రామకృష్ణ, సుధాకర్, జంగారెడ్డి, భూలక్ష్మి కాలనీ అధ్యక్షులు రమేష్, శంకర్, తిరుమల్ రెడ్డి, వెంకట్రాజం, సుబ్బారావు, వివేక్, యధా చారి, సిద్దేశ్వర్, కాలనీ అసోసియేషన్ సభ్యులు, ప్రజలు మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News