Thursday, January 23, 2025

ఎన్నికలలో ప్రజలు చూపిస్తారు… సినిమా: ఈటల రాజేందర్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : రాబోయే ఎన్నికలలో సినిమా చూపించేది ప్రజలని.. సినిమా చూసేది మాత్రం బిఆర్‌ఎస్ పార్టీ నేతలని బిజెపి ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సెటైర్ వేశారు. ఇది ట్రైలర్ మాత్రమేనని.. ప్రతిపక్షాలకు అసలు సినిమా ముందు ఉందని శనివారం స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి కెటిఆర్ చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్యే ఈటల బదులిచ్చారు. ఆగస్ట్ 15వ తేదీన ఎల్బీ నగర్ పోలీసులు గిరిజన మహిళపై దాడి చేసిన ఘటనపైన ఈటల స్పందించారు. స్వాతంత్ర దినోత్సవం రోజున రాష్ట్ర రాజధానిలో గిరిజన మహిళపై పోలీసులు దాడి చేస్తే.. కేవలం ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంటున్నారని మండిపడ్డారు. మహిళపై దాడి ఘటనలో బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలి ఈ సందర్భంగా ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News