Monday, December 23, 2024

ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో విశ్వాసం పెరిగింది..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కెసిఆర్ గారు తీసుకుంటున్న చర్యలతో ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో విశ్వాసం పెరిగిందిని మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు. ఆనాడు సమైఖ్య పాలకుల నిర్లక్ష్యంతో మంచి నీరుకూడా సరిగ్గా దొరక్కా తెలంగాణాలో కిడ్నీ వ్యాది ప్రభలింది. కిడ్నీ వ్యాదిగ్రస్తులకు ఉచితంగా డయాలసిస్ సేవల్ని అందించేందుకు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 9 కేంద్రాలను ముఖ్యమంత్రి కెసీఆర్ గారు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు.

పుట్టిన బిడ్డ నుంచి పండు ముసలి వరకు ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్య సేవల్ని అందించేలా వైద్య రంగంలో గొప్ప సంస్కరణలు తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి కెసీఆర్ ది అని తెలిపారు. మారు మూల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా ప్రసూతి వైద్యాన్ని అందించేలా తీర్చి దిద్దారన్నారు. అనవసర ఆపరేషన్లు చేయకుండా , నార్మల్ డెలివరీలను పెంచి స్త్రీల ఆరోగ్యానికి పెద్దపీట వేశారు సీఎం కెసీఆర్.. ఉమ్మడి నల్గొండ జిల్లా మెడికల్ హాబ్ గా మారింది.. మెడికల్ కాలేజిల ఏర్పాటుతో సుపర్ స్పెషాలిటీ వైద్యం ప్రజలకు అందుతున్నదని మంత్రి వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News