Saturday, December 21, 2024

ప్రజల ప్రభుత్వం కెసిఆర్ ప్రభుత్వం

- Advertisement -
- Advertisement -
  • ఇండ్ల స్థలాల పంపిణీ చేసిన ఎఫ్‌డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి

జగదేవ్‌పూర్: ప్రజల ప్రభుత్వం కెసిఆర్ ప్రభుత్వమని ఎఫ్‌డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. శుక్రవారం జగదేవ్‌పూర్ మండల కేంద్రంలో రెవెన్యూ శాఖ సహకారంతో ఏర్పాటు చేసిన ఇండ్ల స్థలాల పట్టా పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కెసిఆర్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమన్నారు. అనునిత్యం ప్రజల కోసం ఆలోచించే సిఎం కెసిఆర్ అన్నారు. ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఆర్‌డిఓ విజయేందర్ రెడ్డిలు మాట్లాడుతూ తిమ్మాపూర్ గ్రామ ప్రజలు ప్రభుత్వ భూమి సర్వే నెం. 122లో ఇండ్లు కట్టుకున్న 76 మంది రైతులకు ఇండ్ల స్థలాల పట్టా పంపిణీ కార్యక్రమంను స్ధానిక సర్పంచ్ లక్ష్మి రమేశ్ సహకరాంతో అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి బాలేశం గౌడ్, జడ్పిటిసి సుధాకర్‌రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, ఆత్మకమిటీ చైర్మన్ గుండ రంగారెడ్డి,

ఎంపిటిసిల ఫోరం జిల్లా అధ్యక్షుడు కిరణ్‌గౌడ్, ఎంపిటిసి కవిత, సర్పంచ్‌ల ఫోరం మండలాధ్యక్షుడు రచర్ల నరేశ్, కో ఆప్షన్ ఎక్బాల్, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్, సర్పంచ్‌లు చంద్రశేఖర్, యాదవరెడ్డి, లక్ష్మి శ్రీనివాస్‌రెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ ఉపేందర్‌రెడ్డి, వైస్ ఎంపిపి భగవాన్, స్థానిక బిఆర్‌ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు నాగరాజు, ఉప సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు మల్లేశ్, కొండపోచమ్మ డైరెక్టర్ కనకయ్య, పిఎసిఎస్ డైరెక్టర్ వెంకట నర్సయ్య, మండల తహశీల్దార్ రాఘవేంద్ర రెడ్డి, ఆర్‌ఐ నాగరాజు, తిమ్మాపూర్ గ్రామ ప్రజలు, మండల నాయకులు, అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News