Sunday, December 22, 2024

ప్రజల ఆరోగ్యానికే మా మొదటి ప్రాధాన్యత

- Advertisement -
- Advertisement -
  • ప్రజలలో మార్పు వచ్చినప్పుడే పట్టణం బాగుంటుంది
  • మున్సిపల్ చైర్‌పర్సన్ కడవేర్గు రాజనర్సు

సిద్దిపేట: ప్రజల ఆరోగ్యానికే మా మొదటి ప్రాధాన్యత ఇస్తామని మున్సిపల్ చైర్‌పర్సన్ కడవేర్గు రాజనర్సు అన్నారు. బుధవారం స్వచ్ఛ సిద్దిపేట నిర్మాణంలో భాగంగా ప్రతి రోజు ఒక వార్డు చొప్పున చేపట్టిన కార్యక్రమం నడుస్తూ చె త్త వేరుచేయుల కార్యక్రమంలో 33 వార్డులో మున్సిపల్ కమిషనర్ సంపత్‌కుమార్, కౌన్సిలర్ తస్లీమ్ మే బేగం మొయిజ్‌తో కలిసి వార్డులో నడుస్తూ చెత్తను సే కరించించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి రోజు చెత్తను సేకరించే మున్సిపల్ వాహానం క్రమం తప్పకుండా వస్తుందా లేదా అని ప్రజలను అడిగారు. ప్రతి రోజు నల్లాల ద్వారా మంచినీరు వస్తుందా లేదా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. వార్డులో రెం డు మూడు చోట్ల నీరు వృథాగా పోవడాన్ని గమనించిన చైర్మన్ వాటికి బెరడును బిగించారు. వార్డులలో ఇండ్లలో ఎవరు లేకుండా ఉండేటువంటి ఇండ్లలో న ల్లా కనెక్షన్‌లను తొలగించాలని అధికారులకు సూ చించారు. అలాగే గల్లీలలో రోడ్ల పక్కన పెరిగినటువంటి పిచ్చి గడ్డిని తొలగించాలని చెప్పారు. వర్షాకా లం కాబట్టి వార్డులో శిథిలావస్ధ ఇండ్లలో ఎవరైనా ఉంటే ఆటువంటి వారు వెంటనే ఖాళీ చేయాలని సూచించారు. వార్డు ఆఫీసర్లు, సంబంధిత ఎఈలు వార్డులలో పర్యటించాలన్నారు.

మోతుకు ఆకులో టిఫిన్ అభినందనీయం

వార్డు పర్యటనలో భాగంగా టిపిన్ సెంటర్‌లను తనికీ చేస్తున్న సందర్భంగా సదురు టిఫిన్ సెంటర్‌లో మోతుకు ఆకులో టిఫిన్ పెట్టి ఇస్తున్న యజమానిని అభినందించారు. పార్సిల్ కావాల్సిన వారు ఇంటి నుండే స్టిల్ డబ్బాలను తీసుకువచ్చే విధంగా వారికి అవగాహన కల్పించాలని సూచించారు. హోటల్ పరిశుభ్రతపై యజమానులకు పలు సూచనలు చేశా రు.పరిసరాలను ఎప్పుడు పరిశుభ్రంగా ఉండే విధ ంగా చూసుకోవాలని సూచించారు. పాత కూరగాయల మార్కెట్‌లో కూరగాయలు అమ్మే వ్యాపారుల తో కాసేపు ముచ్చటించారు. కూరగాయలు కొనడానికి వ్చిన ప్రజలందరికి ఇంటి వద్ద నుండే జూట్ బ్యా గ్‌లు తెచ్చుకోవాలని సూచించారు. ఎవరు కూడా ప్లాస్టిక్‌ను వినియోగించరాదని తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షన్ 2023లో భాగంగా పట్టణ గాంధి చౌక్ చౌరస్తాలో ప్రజల వద్దకు వెళ్లి ఫీడ్ బ్యాక్ చేపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News