Monday, January 20, 2025

రోడ్డు వెడల్పు, సెంట్రల్ లైటింగ్ పొడవు పెంచాలి

- Advertisement -
- Advertisement -
మంత్రి వేములకు ప్రజా ప్రతినిధుల వినతి

మనతెలంగాణ/హైదరాబాద్: రోడ్డు వెడల్పు,సెంట్రల్ లైటింగ్ పొడవు పెంచాలని మెండోరా, భీంగల్ మండల ప్రజాప్రతినిధులు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డిని ఆదివారం కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా భీంగల్ మున్సిపాలిటీ కేంద్రంలో మరో 450 మీటర్ల పొడవు, మెండోరా మండల కేంద్రంలో మరో 200 మీటర్లు సెంట్రల్ లైటింగ్, రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని మంత్రి వేములకు మెండోరా ప్రజా ప్రతినిధులు, భీంగల్ మున్సిపల్ కౌన్సిలర్లు, విడిసి సభ్యులు హైదరాబాద్‌లో మంత్రి వేములకు వేర్వేరుగా వినతి పత్రం అందజేశారు. మంత్రి ఈ వినతికి సానుకూలంగా స్పందించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News