Thursday, January 23, 2025

ప్రజా వైద్యంపై ప్రజల్లో నమ్మకం పెరిగింది

- Advertisement -
- Advertisement -

నల్లగొండ: సీఎం కేసీఆర్ నాయకత్వంలో అమలు చేస్తున విప్లవాత్మక పథకాలు వినూత్న కార్యక్రమాలతో ప్రాజా వైద్యంపై ప్రజల్లో పెరిగిన నమ్మకం. స్వరాష్ట్రంలో తొమ్మిదేళ్లలో దేశానికి ఆదర్శంగా వైద్య ఆరోగ్యం రంగం నిలుస్తుందని శాసనమండల చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, దేవరకొండ శాసనసభ్యులు రమావత్ రవీంద్రకుమార్ అన్నారు.

బుధవారం తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా దేవరకొండ పట్టణంలోని సాయిరమ్య ఫంక్షన్‌మాల్‌లో జరిగిన తెలంగాణ వైద్య ఆరోగ్య దినోత్సవ కార్యక్రమానికి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, రవీంద్రకుమార్ ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్యంలో బంగారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. 2014కు ముందు 4 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే రాష్ట్రంలో ఉండేవని, కానీ నేడు 26 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు.

ప్రతి సంవత్సరం 6వేలకుపైగా డాక్టర్లను తయారు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అన్నారు. ఒక మెడికల్ కాలేజీ ఏర్పాడితే దానికి అనుబంధంగా 500 బెడ్ల ఆస్పత్రి కూడా ఏర్పడుతుందన్నారు. దాని వలన అందరికి వైద్య సేవలు అందించడం సాధ్యమవుతుందన్నారు. ఆశ వర్కర్లకు గతంలో చాలా తక్కువగా జీతం ఉండేదని, వారి కష్టాన్ని గుర్తించిన సీఎం కేసీఆర్ వారకి రూ.9500 జీతాన్ని అందిస్తున్నారని, అలాగే ఏఎన్‌ఎంలకు రూ.8వేల నుంచి రూ.25వేల జీతం పెంచిన ఘనత తెలంగాణ సర్కార్‌ది అన్నారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీవో గోపిరాం, మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ, ఎంపీపీలు నల్లగాసు జాన్‌యాదవ్, బాణావత్ పద్మ, సునితాజనార్ధన్‌రావు, జడ్పిటిసి మారుపాలకు అరుణసురేష్‌గౌడ్, టివిఎన్‌రెడ్డి, వెలుగూరి వల్లపురెడ్డి, రాజినేని వెంకటేశ్వర్లు, పల్లా ప్రవీణ్‌రెడ్డి, మాధవరం శ్రీనివాస్‌రావు, రైతుబంధు అధ్యక్షులు ఉజ్జిని విద్యాసాగర్‌రావు, బోయపల్లి శ్రీనివాస్‌గౌడ్, శిరందాసు కృష్ణయ్య, ప్రజాప్రతినిధులు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News