Monday, December 23, 2024

‘ప్రజా యుద్ధ నౌక’ గద్దర్ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రజా గాయకుడు, పేదల ప్రజల గొంతుక గద్దర్ నగరంలోని అపోలో స్పెక్ట్రా అమీర్‌పేట ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. వారం రోజుల క్రితం గుండెకు ఆపరేషన్ జరిగిందని, కోలుకుంటూ ఉన్నారని డాక్టర్లు చెప్పిన తర్వాత ఆదివా రం మధ్యాహ్నం మరణించినట్లు తెలిపారు. శస్త్ర చికిత్స విజయవంతమైన చివరకు బెడ్ మీదనే తుది శ్వాస విడిచారు. ఆయన మరణ వార్త వినగానే అభిమానులు, కళాకారులు, రచయితలు, వామపక్ష భావజాలం కలిగిన వా రంతా శోక సంద్రంలో మునిగారు. పేదల ప్రజల గొంతు కై చైతన్య రగిలించే అనేక పాటలు పాడి ప్రజలు గుండెల్లో చిరస్దాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు. గద్దర్ లేనిలోటు తీర్చలేదని కన్నీరు పర్వంతమైయ్యారు. ప్రజల సందర్శనార్ధం ఆయన భౌతిక కాయం ఎల్బీస్టేడియానికి తరలించారు.

సోమవారం మధ్యాహ్నం 12 గంటల అంతిమయాత్ర ప్రారంభమై సికింద్రాబాద్ మీదుగా అల్వాల్ వెళ్లి భూదేవినగర్‌లోని ఆయన ఇంటికి తీసుకుని కొద్దిసేపు ఉంచి తరువాత 2 గంటలకు గద్దర్ స్దాపించిన మహాబోధి విద్యాలయంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుంటు సభ్యులు తెలిపారు. గద్దర్ ఉన్నత విద్య ఇంజనీరింగ్ చదివి కెనరా బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నా తెలంగాణలోని భూస్వామ్య స్వభావం, భూమి చుట్టూ అలుముకున్న జీవితాలతో చలించిపోయారు. సమాజాన్ని మేల్కొల్పాలని భావించారు. తెలంగాణ తొలిదశ, మలి దశ ఉద్యమాల్లో స్వయంగా పాల్గొన్న ఆయన దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా విప్లవ పార్టీలో ఉండి పూర్తికాలం కార్యకర్తగా గడిపారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన దశాబ్దన్నర కాలంగా అజ్ఞాత జీవితాన్ని వదిలి ప్రజల మధ్య ఉంటున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా హన్మాజీపేటలో 1949 జూన్ 5 న జన్మించిన గద్దర్ 1980లో అప్పటి పీపుల్స్ వార్ పార్టీలో చేరారు. హన్మాజీపేట స్వగ్రామమైనా ఆయనకు ఎక్కువ అనుబంధం తూఫ్రాన్ పట్టణంతో ఉంది. నాలుగు దశాబ్దాల పాటు విప్లవ జీవితం గడిపారు. జననాట్యమండలి పేరుతో పీపుల్స్ వార్ పార్టీ స్థాపించిన సాంస్కృతిక వేదిక ఆవిర్భావం నుంచి చురుకుగా పొల్గొంటున్న గద్దర్ వందలాది మంది కళాకారులను తయారు చేశారు. ఆయనతో పాటు కలిసి పనిచేసిన పలువురు కళాకారులు ఇప్పటికీ మావోయిస్టు పార్టీలో కొనసాగుతున్నారు. వామపక్ష భావజాలాన్ని తనదైన శైలిలో పాటల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్ళడంలో విజయవంతమైయ్యారు. బ్రిటీషు వలస పాలనకు వ్యతిరేకంగా పంజాబ్‌లో జరిగిన గదర్ పోరును స్ఫూర్తిగా తీసుకుని తల్లిదండ్రులు పెట్టిన గుమ్మడి విఠల్ పేరును గద్దర్‌గా మార్చుకున్నారు.

హైదరాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో విద్యాభ్యాసం చేసిన గద్దర్ 1969లో వచ్చిన తొలి దశ తెలంగాణ ఉద్యమంలో విద్యార్థిగా ఉంటూనే ప్రజలను చైతన్య చేసేందుకు అనేక పాటలు పాడారు. బ్యాంకు ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్న నక్సల్బరీ ఉద్యమం ప్రభావంతో వామపక్ష భావజాలం వైపు అడుగులేశారు. 1978లో జగిత్యాల జైత్రయాత్రతో ప్రభావితులై 1980వ దశకంలో ఏర్పడిన పీపుల్స్ వార్ పార్టీలో కీలక పాత్ర పోషించారు. ఆ భావజాలంతోనే ఆయన తన పిల్లలకు సూర్యుడు (సూర్యం), చంద్రుడు (చంద్రం), వెన్నెల అనే పేర్లు పెట్టుకున్న గద్దర్ విప్లవోద్యమంలో అజ్ఞాత జీవితంలోకి వెళ్లినా పిల్లల బాగోగులను ఆయన భార్య విమల చూసుకున్నారు. నిజాం పాలనలో రజాకార్ల అకృత్యాలపై వెండి తెరకు ఎక్కిన మా భూమి సినిమాలో యాదగిరి పాత్ర పోషించి బండెనక బండి కట్టి పాట తెలుగు ప్రజలను ఉత్తేజిత్తులను చేశారు. దర్శకుడు బి. నర్సింగ్‌రావు చొరవ తీసుకుని ఆయనతో పాట రాయించి పాడించారు. మొదటి నుంచి పాలకుల ప్రజా వ్కతిరేక స్వభావాన్ని ఎండగడుతూ సొంతంగా పాటలు రాసి పాడిన గద్దర్ తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాక దేశ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉన్నంది. నకిలీ ఎన్‌కౌంటర్లకు వ్యతిరేకంగా కొట్లాడిన గద్దర్ అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావు, చంద్రబాబుపైనా అనేక పాటలు రాసి ప్రజలను చైతన్య పరిచారు.

కారంచేడులో దళితులపై జరిగిన హత్యాకాండను తీవ్రంగా వ్యతిరేకించిన గద్దర్ చివరి వరకూ అంబేద్కరైట్ గా చెప్పుకున్నారు. చంద్రబాబు పాలనను నిరంకుశత్వంగా అభివర్ణించిన గద్దర్ అనేక వీధి ప్రదర్శనలతో పాటు జానపద బాణిలో పాడిన పాటలు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళాయి. దీంతో ఆయనపై 1997 ఏప్రిల్ 6న హత్యాయత్నం జరిగింది. ఇప్పటికీ బుల్లెట్లు ఆయన దేహంలోనే అలాగే ఉండిపోయింది. పీపుల్స్ వార్ పార్టీపై ప్రభుత్వం తీవ్ర నిర్బంధం విధించినప్పుడు అజ్ఞాత జీవితంలోకి వెళ్ళిన గద్దర్ రహస్యంగానే జననాట్యమండలి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. అఖిల భారత విప్లవ విద్యార్ధి సమాఖ్య (ఏఐఆర్‌ఎస్‌ఎఫ్), అఖిల భారత విప్లవ సాంస్కృతిక సమితి (ఏఐఎస్‌ఆర్సీ) తదితర ఫ్రంటల్ ఆర్గనైజేషన్‌ను పక్క రాష్ట్రాల్లోకి తీసుకెళ్ళడానికి తన వంతు కృషి చేశారు.

ఆయన ఆట పాటలతో వేలాది మంది యువత, విద్యార్థులు ఆకర్షితులై పీపుల్స్ వార్ పార్టీలోకి వెళ్లిపోయారు. అప్పటి తరం విద్యార్థులు ఇప్పుడు మావోయిస్టు పార్టీలో నాయకత్వ స్ధానాల్లో ఉన్నారు. ప్రభుత్వం ఆయన ఆట పాటలకు నంది అవార్డు ఇస్తామని ముందుకొచ్చినా దాన్ని తిరస్కరించారు. 2001లో ప్రారంభమైన తెలంగాణ మలిదశ ఉద్యమంలో తనదైన శైలిలో ఆట పాటలతో కాలికి గజ్జెకట్టి ప్రజలను కూడా ఉద్యమం వైపు మళ్లించారు. కుల వివక్ష, లింగ అసమానత, భూ స్వామ్య దోపిడీ, పేదలపై అణచివేత తదితర అంశాలతో ప్రజలను తన పాట ద్వారా చైతన్యం చేశారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి సాహిత్య పురస్కారాన్ని అం దుకున్న గద్దర్ అంబేద్కర్ అంతర్జాతీయ పురస్కారాన్ని, లోకాయుక్త అవార్డును పొందారు. విప్లవ పాటలకు కేరాఫ్ అడ్రస్ గా గద్దర్ తనదైన ముద్రను తెలుగు ప్రజల గుండెల్లో పదిలం చేసుకున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News