Thursday, December 19, 2024

భారతదేశంలో తమ మొట్టమొదటి టివిసి విడుదల చేసిన పెపెజీన్స్‌

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: యుకె కేంద్రంగా కలిగిన డెనిమ్‌ సంస్ధ పెపె జీన్‌ లండన్‌, తరతరాలుగా భారతీయ యువత అభిమాన బ్రాండ్‌గా వెలుగొందుతుంది. ఇప్పుడు ఈ బ్రాండ్‌ తమ బంధం మరింతగా పెంచుకుంటూ భారతీయ మార్కెట్‌లో తమ మొట్టమొదటి టీవీ కమర్షియల్‌ను విడుదల చేసింది. ‘టైమ్‌ టు షైన్‌’ శీర్షికన విడుదల చేసిన ఈ ప్రచార చిత్రం ద్వారా డెనిమ్‌, లైఫ్‌స్టైల్‌ ప్రియులను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ చిత్రంలో పెపె జీన్స్‌ లండన్‌ ఆటమ్‌ వింటర్‌ 2022 కలెక్షన్‌ ప్రదర్శిస్తున్నారు.

బార్సిలోనాకు చెందిన క్రియేటివ్‌ ప్రొడక్షన్‌ కంపెనీ కెనడా రూపొందించిన ఈ ప్రచార చిత్రం ద్వారా ఆత్మవిశ్వాసంతో తమను తాము ప్రదర్శించుకోమని వెల్లడిస్తుంది. పెపె జీన్స్‌ లండన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓ మనీష్‌ కపూర్‌ మాట్లాడుతూ ‘‘భారతదేశంలో పెపె జీన్స్‌ లండన్‌ ప్రయాణంలో అత్యంత ఉత్సాహ పూరిత సమయమిది. మా బ్రాండ్‌ వారసత్వాన్ని భారతీయులు అమితంగా అభిమానిస్తుంటారు. ఇప్పుడు ఈ బ్రాండ్‌ టీవీ కమర్షియల్‌ ద్వారా పూర్తి నూతన మార్కెట్‌లలో దానిని ప్రదర్శించాలనుకుంటున్నాము’’ అని అన్నారు.

ఈ టీవీసీని పలు సుప్రసిద్ధ టీవీ ఛానెల్స్‌లో ప్రసారం చేయనున్నారు.

Link to the TVC Campaign :https://youtu.be/QcIalnYsZiA

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News