Sunday, November 17, 2024

‘పెప్పర్‌ఫ్రై’ సిఇఓ అంబరీష్ మూర్తి హఠాన్మరణం

- Advertisement -
- Advertisement -

ముంబయి: ప్రముఖ ఫర్నీచర్, హోమ్ డెకార్ ఇకామర్స్ కంపెనీ ‘పెప్పర్‌ఫ్రై’ సహ వ్యవస్థాపకుడు, సిఇఓ అంబరీష్ మూర్తి(51) గుండెపోటుతో మృతిచెందారు. ఆయన మరణ వార్తను కంపెనీ మరో సహవ్యవస్థాపకుడు ఆశిష్ షా ట్విట్టర్‌లో వెల్లడించారు.‘ నా స్నేహితుడు, సహచరుడు, పలు విషయాల్లో నా గురువు అంబరీష్ మూర్తి ఇక లేరు. నిన్నరాత్రి ఆయన గుండెపోటుతో లేహ్‌లో కన్నుమూశారు’ అని ఆశిష్ షా ట్వీట్‌లో పేర్కొన్నారు. అంబరీష్ మూర్తికి బైక్ రైడ్ అంటే ఎంతో ఇష్టం. ఆయన తరచూ ముంబయినుంచి లేహ్‌కు బైక్‌మీద వెళ్తుంటారు.

Also Read: మద్యం దుకాణాలకు భారీ స్పందన

ఈ క్రమంలోనే లేహ్‌కు వెళ్లిన మూర్తి సోమవారం గుండెపోటుతో మృతి చెందినట్లు సమాచారం. 2012లో అంబరీష్ ఆశిష్‌తో కలిసి పెప్పర్ ఫ్రై సంస్థను ప్రారంభించారు. ఈ సంస్థ ఆన్‌లైన్‌లో ఫర్నీచర్, హోమ్ డెకార్ ఉత్పత్తులను విక్రయిస్తుంది.పెప్పర్ ఫ్రై నెలకొల్పడానికి ముందు అంబరీష్ ఈబేలో భారత్, ఫిలిప్పీన్స్, మలేసియా దేశాల్లో మేనేజర్‌గా పని చేశారు. అంతకు ముందు లెవీ స్ట్రాస్, బ్రిటానియా, పిఅండ్ ఎల్ వంటి సంస్థల్లో వివిధ హోదాల్లో పని చేశారు. ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అంబరీష్ ఐఐఎం కలకత్తా లో ఎంబిఎ పట్టా అందుకున్నారు. ఆయన మృతిపట్ల పలువురు సంతాపం తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News