మనతెలంగాణ/హైదరాబాద్ : దావోస్ వేదికగా రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. పలు ప్రతిష్టాత్మక సంస్థలు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అంగీకారం తెలిపాయి. మరికొ న్ని తమ కార్యకలాపాలను రెట్టింపు చేయనున్నట్లు ప్రకటించాయి. ఈ వేదికపై తెలంగాణ పెవిలియన్‌ను ప్రారంభించిన మంత్రి కెటిఆర్ రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయంగా పలువురు వ్యా పార దిగ్గజాలు, సీఈఓలతో సమావేశమవుతున్నా రు. ఈ క్రమంలోనే పెప్సీకో పాటు మరో 2 సంస్థ లు రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకొచ్చాయి.
ఉద్యోగుల సంఖ్యను 4 వేలకు పెంచుతాం: పెప్సీకో సంస్థ ఉపాధ్యక్షుడు
అందులో భాగంగా ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు సందర్భంగా దావోస్‌లోని తెలంగాణ పెవిలియన్ లో ఐటి, పరిశ్రమల మంత్రి కెటిఆర్ పెప్సీకో సంస్థ ఉపాధ్యక్షుడు రాబర్డో అజేవేడోతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో ఆ సంస్థ కార్యకలాపాలు రెట్టింపు చేయనున్నట్లు పెప్సీకో సంస్థ ఈ సందర్భంగా ప్రకటించింది. దీంతోపాటు 2019 లో 250 మందితో ప్రారంభమైన గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ సెంటర్ ప్రస్తుతం 2800 మంది ఉద్యోగు లు పని చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సంఖ్య ను 4వేలకు పెంచనున్నట్లు ఆయన చెప్పారు. ఏడాదిలో అదనపు ఉద్యోగులను నియమించుకోవడం తో పాటు సంస్థ కార్యకలాపాలను భారీగా విస్తరిస్తామన్నారు. గ్లోబల్ బిజినెస్ సర్వీస్ సెంటర్ విస్తరణతో పాటు రాష్ట్రంలో పెప్సికో ఇతర విభాగాల విస్తరణ అవకాశాలపై రాబర్టోతో కెటిఆర్ చర్చించారు. పెప్సికో నిర్ణయంపై కెటిఆర్ హర్షం వ్యక్తం చేశారు. కంపెనీ విస్తరణ ప్రణాళికలకు అవసరమైన సహాయ, సహకారాలు ప్రభుత్వం తరఫున అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
రూ.750 కోట్లతో అలాక్స్ పెట్టుబడి
తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అలాక్స్ సంస్థ ముందుకు వచ్చింది. బ్యాటరీల తయారీలో అలాక్స్ సంస్థకు ఎంతో పేరుంది. రూ.750 కోట్ల తో మల్టీ గిగావాట్ లిథియం క్యాథోడ్ మెటీరియల్ తయారీ కేంద్రం ఏర్పాటు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో లిథియం ఐరన్ ఫాస్పేట్ యాక్టివ్ బ్యాటరీలు ఉత్పత్తి చేయనున్నారు. దావోస్‌లో కెటిఆర్ సమక్షంలో అలాక్స్ సంస్థ ప్రతినిధులు, తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. రూ.210కోట్ల పెట్టుబడితో మొదట మూ డు గిగావాట్ల సామర్థ్యంతో లిథియం ఐరన్ ఫాస్పే ట్ బ్యాటరీలను ఉత్పత్తి చేస్తామని, భవిష్యత్‌లో దానిని పది గిగావాట్లకు పెంచి 2030 నాటికి మొత్తంగా రూ.750 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు కంపెనీ పేర్కొంది.
అపోలో డిజిటల్ ఇన్నోవేషన్ సెంటర్
తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యంతో హైదరాబాద్లో డిజిటల్ ఇన్నోవేషన్ సెంటర్ ప్రారంభించనున్నట్లు అపోలో టైర్స్ లిమిటెడ్ తెలిపింది. లండన్ తర్వాత తమ రెండో డిజిటల్ ఇన్నోవేషన్ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నట్లు ఆ సంస్థ పేర్కొంది. దావోస్‌లో మంత్రి కెటిఆర్ సమక్షంలో తెలంగాణ ప్రభుత్వంతో ఆ సంస్థ విసి ఎండి నీరజ్ కన్వర్ ఒప్పందం కుదుర్చుకున్నారు. నాలుగో పారిశ్రామిక విప్లవంలో భాగంగా వినూ త్న సాంకేతికతతో కొత్త వ్యాపార నమూనాలు అభివృద్ధి, వినియోగదారులకు మెరుగైన సౌకర్యాలు క ల్పించడంలో ఇన్నోవేషన్ కేంద్రం ప్ర ధాన పాత్ర పోషిస్తుందని అపోలో టైర్స్ తెలిపింది. డిజిటల్ వ్యూహాలైన ఐఓటి, క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషీయల్ ఇంటలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, రోబోటిక్ ప్రా సెస్ ఆటోమేషన్, బ్లాక్ చైన్ వంటి వినూత్న సాంకేతికతలను ఉపయోగించుకొని, కొత్త వ్యాపా ర నమూనాలను అభివృద్ధి చేయడం, వినియోగదారులకు మరిన్ని మెరుగైన సౌకర్యాలను కల్పించడం లో డిజిటల్ ఇన్నోవేషన్ కేంద్రం ప్రధాన పాత్ర పోషిస్తుందని సంస్థ ఎండి నీరజ్ పేర్కొన్నారు.
అద్భుత వ్యవస్థకు అపోలో డిజిటల్ ఇన్నోవేషన్ : మంత్రి కెటిఆర్
వినూత్న ఆవిష్కరణలకు ఊతమిచ్చేలా రాష్ట్రంలో ఏర్పడిన అద్భుత వ్యవస్థకు అపోలో డిజిటల్ ఇన్నోవేషన్ సెంటర్ సరైన జోడింపుగా నిలుస్తుందని కెటిఆర్ తెలిపారు.టి హబ్, వి హబ్, టీ వరక్స్ వంటి ప్రపంచ స్థాయి ప్రమాణాలు కల సంస్థలతో వినూత్న ఆవిష్కరణలకు ఊతం ఇచ్చే ఒక అద్భుతమైన వ్యవస్థ తెలంగాణలో ఏర్పడిందని మంత్రి కెటిఆర్ తెలిపారు. అపోలో డిజిటల్ ఇన్నోవేషన్ సెంటర్ దీనికి సరైన జోడింపు అన్నారు.