Monday, January 20, 2025

జనం సగటు ఆమ్దాని 33 శాతం పెరిగింది

- Advertisement -
- Advertisement -

 

న్యూఢిల్లీ : దేశంలో ప్రజల తలసరి ఆదాయం 33.4 శాతం పెరిగిందని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియచేసుకుంది. 2013లో జాతీయ ఆహార భద్రత చట్టం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ) అమలులలోకి తెచ్చిన తరువాత ఈ తలసరి ఆదాయం ఈ మేరకు ఇనుమడించిందని ఉన్నత న్యాయస్థానానికి కేంద్రం తమ అఫిడవిట్‌లో తెలియచేసుకున్నారు. తలసరి ఆదాయం పెరగడంతో దేశంలో అత్యధిక సంఖ్యలో కుటుంబాలు పేదరికం నుంచి అధిక ఆదాయ వర్గంలోకి చేరారని కూడా తెలిపారు. గత ఎనిమిదేళ్లలో ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ తరువాతి దశలో ఈ కీలక పరిణామం చోటుచేసుకుందనివివరించారు. 201314 దశలో అణగారిన వర్గాల స్థాయిలో ఉన్న వారిలో చాలా మంది ఇప్పుడు ఆ దుస్థితిలో లేరని వారి పరిస్థితి మారిందని కేంద్రం తెలియచేసుకుంది.

వలస కార్మికుల బాగోగులకు ఏం చేస్తున్నారనే వివరాలను కేంద్రం నుంచి వచ్చేలా చేయాలని దాఖలు అయిన పిటిషన్ విచారణ దశలో కేంద్రం తాము వలస కార్మికులకు పలుసంక్షేమ చర్యలు చేపట్టామని, ఆహార భద్రత చట్టంను అమలులోకి తీసుకురావడం ఈ కూలీలకు కూడా మేలు చేసిందని కేంద్రం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం 2013 సెప్టెంబర్ 10వ తేదీన ఆహార భద్రత చట్టాన్ని తీసుకువచ్చింది. మనిషి జీవిత చక్రం పరిధిలోకి సరైన ఆహారం, జనం పౌష్టికత తీసుకువచ్చేలా ఈ చట్టం ఉద్ధేశాలను రూపొందించారు.

చవక ధరలకు ప్రజలకు సరిపోనూ ప్రామాణిక ఆహార ధాన్యాలను నిర్ధేశిత ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా సబ్సిడీ ఆహార ధాన్యాలను అందించేందుకు ఈ పథకాన్ని తలపెట్టారు. ఈ చట్టం పరిధిలో గ్రామీణ ప్రాంతాలలో 75 శాతం వరకూ ప్రజలకు మేలు జరుగుతోందని, ఇక పట్టణ జనాభా విషయానికి వస్తే 50 శాతం మంది వరకూ ఈ సరుకులు అందుకుంటున్నారని, ఈ క్రమంలో వారికి ఆదా జరిగి, వారి తలసరి ఆదాయ నిష్పత్తి పెరిగిందని అఫిడవిట్‌లో తెలిపారు. ఈ పథకం పరిధిలో గత ఎనిమిదేళ్లలో దేశంలో కొత్తగా 4.7 కోట్ల రేషన్ కార్డులను పంపిణీ చేశారని కూడా వివరించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News